త్రిష డబ్బు గురించి ఆలోచించకుండా ఇమీడియట్‌గా దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లిపోయారు. త్రిష ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. షూటింగ్ పనిమీద కాదు... అందాన్ని మెరుగుపరచుకునే పనిమీద. త్రిష అందంగానే ఉంటారు కదా.. మళ్లీ ప్రత్యేకించి అందం కోసం దక్షిణాఫ్రికా వెళ్లడం ఏంటి...? అనుకుంటున్నారా! ఆ విషయానికొస్తే... ‘పెద్ద హీరోల పక్కన తప్ప, యువహీరోల పక్కన త్రిష నప్పదు. అక్కలా ఉంటుంది’ అని ‘దమ్ము’ తర్వాత త్రిషపై చాలా కామెంట్లు వచ్చాయి. దాంతో త్రిష చాలా హర్ట్ అయ్యారట. అలాంటి సమయంలోనే త్రిషకు ఓ విలువైన సమాచారం అందింది. అదే... ‘లింకోనా మసాజ్’. దక్షిణాఫ్రికాలో శాస్త్రీయ పద్ధతిలో చేసే ఓ విధమైన మసాజ్ ఇది.
ఈ మసాజ్ అందంపై చాలామంచి ప్రభావాన్ని చూపుతుందట. పైగా అది చాలా ఖరీదుతో కూడుకున్న విషయం కూడా. ఈ విషయాన్ని తెలుసుకున్న త్రిష డబ్బు గురించి ఆలోచించకుండా ఇమీడియట్‌గా దక్షిణాఫ్రికా బయలుదేరి వెళ్లిపోయారు. సో... అక్కడ ఆ ట్రీట్‌మెంట్ తర్వాత త్వరలో మరింత అందంతో ఈ ముద్దుగుమ్మ చెన్నయ్‌లో అడుగుపెట్టనున్నారు. త్రిష ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే... త్రిష ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నారు.
విశాల్, జీవా, ‘జయం’ రవి ఆ సినిమాల్లో కథానాయకులు. ఈ ముగ్గురూ యువహీరోలే. ఇందులో ‘జయం’రవిని మినహా ఇస్తే... విశాల్, జీవా ఇద్దరూ వయసు రీత్యా త్రిష కంటే చిన్నవాళ్లే. దాంతో త్రిష ముందుగానే అప్రమత్తమయ్యారట. ‘దమ్ము’ విషయంలో ఎదురైన చేదు అనుభవం మళ్లీ ఎదురుకాకూడదనే ఉద్దేశంతో త్రిష ఇలా దక్షిణాఫ్రికా వెళ్లారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more