Chief priest incurs ttd ire for ambani meet

Chief priest incurs TTD ire for Ambani meet,Tirumala chief priest Ramana Deekshitulu has landed in a controversy yet again over his meeting with Anant Ambani

Chief priest incurs TTD ire for Ambani meet

Ambani.gif

Posted: 05/16/2012 06:16 PM IST
Chief priest incurs ttd ire for ambani meet

Chief priest incurs TTD ire for Ambani meet

ఏకంగా తిరుమల లాంటి గుడికి ప్రధాన అర్చకుడిగా ఉన్న వారు సైతం డబ్బున్న వారి సేవలో తరిస్తున్నారు. తిరుమల అర్చకులు కూడా డబ్బున మహరాజుల సేవలో తరించిపోతున్నారు.  తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో డబ్బున వారిదే హవా అనే విమర్శలు చాలా రోజులుగానే ఉన్నాయి. ఉన్న వారికి ఒక తరహా మర్యాదలు జరిగితే సామాన్య భక్తులకు మాత్రం ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. స్వామి వారి సేవలో తరించాల్సిన అర్చకులు డబ్బులకు దాసోహమంటున్నారు. తాజాగా తిరుమల దేవస్థానం ప్రధానార్చకులు రమణ దీక్షితులు ముకేష్ అంబానీ కుమారిడి సేవలో తరించడం వివాదాస్పదంగా మారింది.

ముకేష్ అంబానీ కుమారుడు దైవ దర్శనం కోసం తిరుమల వచ్చాడు. దర్శనం చేసుకున్న తరువాత  గెస్ట్ హౌస్ లో ఉన్న అంబానీ కుమారుడి వద్దకు వచ్చి రమణ దీక్షితులు ఆశీర్వచనం పలకడంతో వివాదాస్పదం అయింది. గతంలో కూడా ఇదే తరహాలో రమణ దీక్షితులు అంబానీల గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి ఆశీర్వచనాలు పలకడంతో వివాదాస్పదం కావడంతో అప్పుడు టీటీడీ ఆయనకు మెమోలు జారీచేసింది. అయినా మరోసారి రమణదీక్షితులు అంబానీల గెస్ట్ హౌస్ కు వెళ్లి ఆశీర్వచనం పలకడం వివాదాలకు దారితీసింది.  గతంలో  పెద్ద అంబానీ కుటుంబాన్ని  కలవడం ఓ ఎత్తయితే తాజాగా తిరుమలకు వేంచేసిన చిన్న అంబానీ సేవలో కూడా అయ్యవారు తరించిపోయారు. 2010లో తిరుమలకు వచ్చిన ముఖేశ్ అంబానీ గెస్ట్ హౌస్ కు వెళ్లి మరీ రమణ దీక్షితులు వేద ఆశీర్వాదం అందించారు. అది అప్పట్లో వివాదాస్పదమయింది. అప్పటి కార్యనిర్వహణాధికారి ఐవైఆర్  కృష్ణ  రావు రమణ దీక్షితులు కు మెమో జారీచేశారు. ఆ తరువాత దీనిపై దీక్షితులు కోర్టుకు వెళ్లనా ఆయననే తప్పుపట్టింది. తిరుమల నిబంధనల ప్రకారం దీక్షితులు చర్య తప్పు.

అయితే వారం క్రితం ఇదే సంఘటన తిరిగి రిపీట్అయింది. ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ (17) తిరుమలకు విచ్చేశాడు. దీంతో అంబానీలంటే పడిచచ్చే దీక్షితులు అనంత్ అంబానీ ఉంటున్న గెస్ట్ హౌస్ కు వెళ్లి మరీ ఆశీర్వాదం అందించారు. దీంతో మరోసారి వివాదం చెలరేగింది. శ్రీవారి ప్రధాన అర్చకుడిగా ఉన్న దీక్షితులు మాత్రం అంబానీల ఇంటి పూజారిగా మారిపోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. దీనిపై శాఖా పరమయిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan should surrender in court
Face to face with producer natti kuma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more