Chiru son in law sirish bhardwaj to join ysrcongress

Chiru Son-in-law Sirish Bhardwaj to join Y.S.R.Congress,SiriSh Bharadwaj, YSR Congress, Chiranjeevi ... Sirish made it clear that he is not joining any political party, jeevitha , rajasekar, pulla padmavathi, devineni, bharatam, yv subbareddy, telugudesam

Chiru Son-in-law Sirish Bhardwaj to join Y.S.R.Congress

Chiru.gif

Posted: 05/14/2012 06:00 PM IST
Chiru son in law sirish bhardwaj to join ysrcongress

Chiru Son-in-law Sirish Bhardwaj to join Y.S.R.Congress

బెల్లం కోసం  చీమలు వెతకటం సహజం. కానీ  మంచి మీద  బురద చల్లటం కోసం  తపన పడేవారిలో  జగన్ ఒకడు అని ప్రజలు అంటున్నారు. ఒక పక్క అవినీతి లో నెం.1 అయిన జగన్. ఆ అవినీతితో సంపాదించిన సొమ్మును కొంతమందికి ఎరగా వేసి వారి ద్వార లబ్థిపొందాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడని  కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.  ఇప్పుడు  జగన్ అదే బాటలో  చిరంజీవి మాజీ అల్లుడు పై జగన్ కన్ను పడినట్లు  ప్రజలు అనుకుంటున్నారు. అందుకోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రాజ్యసభ సభ్యుడు చిరం జీవి మాజీ అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ చేరు తున్నారా.. అంటే అవుననే తెలుస్తుంది. శిరీష్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత వైవి సుబ్బా రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌లో చేరాలనే ఉద్దేశ్యంతోనే శిరీష్‌ భరద్వాజ్‌ వైవి సుబ్బారెడ్డిని కలిసారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చిరం జీవి రెండో కూతురు శ్రీజ శిరీష్‌ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విష యం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయి . శిరీష్‌ పైన వరకట్న వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే . ఆ కేసు పై  శిరీష్‌ బెయిల్‌ తెచ్చుకొని బయట ఉన్నారు.  

ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో కాని, కాంగ్రెస్‌ పార్టీలో కాని చేరాలనే అభిప్రాయంతో శిరీష్‌ ఉన్నారనే గత కొంత కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, టీడీపీ కంటే, జగన్‌ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వైవి సుబ్బా రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి జోరుగా వలసలు పెరుగుతున్నాయనే విషయం తెలిసిందే. తెలుగు దేశం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పలువురు నేతల జగన్‌ పార్టీలోకి చేరుతున్నారు. చిరంజీవికి చెక్‌ పెట్టేందుకు శిరీష్‌ను కూడా పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందనే యోచనలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. చిరుతో శిరీష్‌కు ఉన్న విబేధాల నేపథ్యంలో ఆయనను తీసుకుంటే రాజకీయంగా మరింత లబ్ది చేకూరుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. శిరీష్‌కు ప్రజల్లో అంత ఇమేజ్‌ లేకపోయినప్పటికీ, ఆయన మామ చిరంజీవికి ఆయనకు ఉన్న విభే దాల నేపథ్యంలో శిరీష్‌ను తమ పార్టీ లోకి తీసుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు సమాచారం.

అసలు  ఎలాంటి ప్రజాభిమానం లేని వ్యక్తి పై జగన్  అంత శ్రద్ద ఎందుకు చూపుతున్నాడు అంటే.. అతని ద్వార మెగా స్టార్ చిరంజీవి పై బురద చల్లటానికి అనే సమాధానం సీనియర్ రాజకీయ నాయకుల నుండి  వినబడుతుంది.   గతంలో కూడా  జగన్  చిరంజీవి పై  కొన్ని ప్రేమ ( జీవిత రాజశేఖర్లు) జంటలను  వదిలిన విషయం తెలిసిందే.  చివరకు ఆజంటకు గుడు చేదిరిపోవటంతో.. అసలు విషయం కాంగ్రెస్ నాయకుడైన  టీఎస్సార్ తో చెప్పి బాధపడిపోయారు. అంబటి రాంబాబు చేత మాకు డబ్బులు ఇప్పించి  మీడియా ద్వారా  చిరంజీవి పై అనేక విమర్శలు చేయమాని  చెప్పిన వ్యక్తి జగనే అని  జీవిత రాజశేఖర్లు ఈ మద్యనే  చెప్పటం అందరికి తెలిసిందే.

అదే విధంగా జగన్ విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన దేవినేని కుటుంబాన్ని విడదీసిన విషయం ప్రజలకు తెలిసిందే. అలాగే కాంగ్రెస్ నాయకుడు అయిన దర్మన్న ప్రసాద్ కుటుంబంలో  చిచ్చు పెట్టింది  జగనే కదా అని ప్రజలు అంటున్నారు.  అలాగే  రీసెంట్ గా  పుల్లా పద్మవతి కూడా  జగన్ పార్టీ నుండి తప్పించుకొని  బయటపడిన విషయం మీడియా ద్వారా ఆమె చెప్పటం విశేషం.  అంతే కాకుండా  జగన్ టీఆర్ఎస్ పార్టీ తో దొంగచాటుగా పొత్తు పెట్టుకొని ఆపార్టీకి  భారీ ఎత్తున్న డబ్బులు ఇచ్చాడనే వార్తలు  తెలంగాణ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇప్పడు  అదే బాటలో  జగన్ చిరంజీవి మాజీ అల్లుడి పై కూడా  భరీ ఎత్తున ఖజాన ఆశ చూపి, తన పార్టీలో చేరమని  వైవి సుబ్బారెడ్డితో మంతనాలు జరుపుతున్నారని  జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.  అంతేకాకుండా  జగన్ పార్టీ గెలిస్తే .. శిరీష్ కు మంచి పదవి ఇస్తానని చెప్పటంతో.. అతను జగన్ పార్టీలో  చేరటానికి సుఖుముంగానే ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  జగన్ శిరిష్ కోసం ఎందుకు తపన పడుతున్నాడు అంటే..  శిరిష్ జగన్ పార్టీలో చేరటంతో.. తన పార్టీ ప్రచారానిక బాగ ఉపయోగపడతాడని  జగన్ ఆలోచన.  శిరిష్ తో చిరంజీవి అడ్డుకట్ట వేయాలని  జగన్ చూస్తున్నాడని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చిరంజీవి ఎక్కడికి వెళ్లితే అక్కడ శిరిష్ చేత  విమర్శలు చేయించాలని  జగన్ కొత్త ప్లానట.

అసలు జగన్ వలకం చూస్తుంటే.. భారతంలో ఒక వ్యక్తి గుర్తుకు వస్తున్నాడు. ఎవరో కాదు భారతంలో శకుని లాగా ఉన్నాడని  ప్రజలు అంటున్నారు. అసలు జగన్ ఊసరవెల్లి లాగా ఇన్ని రంగులు ఎలా మార్చుతున్నాడని సామాన్య ప్రజలు అంటున్నారు.  ఊసరవెల్లి సినిమా  ఎన్టీఆర్ కాకుండా  జగన్ కు అయితే చాలా బాగుంటుందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ఒకప్పుడు  జగన్  సోనియా, రాహుల్ గాంధీ ఇంటి చుట్టు తిరిగి, ఇప్పుడు వారిమీద విమర్శలు చేయటం చూస్తే  జగన్ యొక్క మనస్సు అర్థం అవుతుందని ఢిల్లీ  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అవినీతి చేయటంతో మొదటి వ్యక్తిగా ఇప్పటికే  గిన్నిస్ రికార్డు ఎక్కిన జగన్ . ఇక అవినీతిపై పోరాటం చేస్తాను, అవినీతిని అంతం చేస్తానని  భారీ డైలాగులు చెప్పటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇటీవల కాలంలో  చిరంజీవికి  పెరుగుతున్న ఇమేజ్ ను చూసి తట్టుకోని  జగన్ ఎలగైన  చిరంజీవి బురద చల్లలానే ప్రయత్నం చేస్తున్నారని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  చిరంజీవి గురించి నిజం ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. చిరంజీవి ఎలాంటి వారు, జగన్ ఎలాంటి వారు అనే ప్రశ్నలు ప్రజలు వేసుకుంటున్నారు.   చిరంజీవి పై జగన్ విమర్శలు చేయటం  మంచిది కాదని,  చిరంజీవి ప్రజల మనిషి అని,  జగన్ పార్టీ నుండి చిరంజీవి పై విమర్శలు చేసిన జీవిత రాజశేఖర్లు చెప్పటం జగన్ తెలుసుకోవాలని  ప్రజలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold war between kcr vs kodandaram exposed
Ms dhoni wife sakshi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more