టాలీవుడ్ హీరోల్లో ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. మహేష్ బాబు తన తరువాతి సినిమాకి ఇంత వరకు ఎవరూ తీసుకోనంత 15 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్యన వచ్చిన శక్తి సినిమాకి తన రెమ్యునరేషన్ 9 కోట్లు తీసుకున్నాడని, అశ్వినిదత్ ఇంత మొత్తం చెల్లించాడని, ఆ సినిమా అంతగా ఆడక పోతే అశ్వినీదత్ ఇల్లు కూడా అమ్మకున్నాడని వార్తలు వచ్చాయి. తాజా జూ. ఎన్టీఆర్ తన తరువాత సినిమాకి 12 కోట్లు తీసుకోబోతున్నాడని సమాచారం.
ఇక మిగతా హీరోల విషయం ప్రక్కన పెడితే... తాజాగా టాలీవుడ్ లో జూనియర్, ప్రిన్స్, చరణ్, బన్ని లాంటి యువ హీరోల తరువాత యూత్ ని అలరించే మరో స్టార్ పవన్ కళ్యాణ్. ఇతని సినిమాలు గత కొంత కాలంగా బాక్సాఫీసు వద్ద బొల్తా కొడుతున్న కలెక్షన్లు మాత్రం భారీగా నే వస్తున్నాయి. ఇతనికున్న యూత్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలోనే ఏ హీరోకి లేనంత పవన్ కి యూత్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇప్పుడు ఇతని రెమ్యున రేషన్ టాలీవుడ్ లో ఏ హీరో తీసుకోనంత తీసుకోబోతున్నాడని ఫిలింనగర్ న్యూస్.
అసలు ‘గబ్బర్ సింగ్’ చిత్రం చేయాలనే ఆలోచన చేసింది పవన్ కళ్యాణే. తన సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే ‘తీన్ మార్’ చిత్రం ద్వారా నష్ట పోయిన నిర్మాత గణేష్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి అతనికి అవకాశం ఇచ్చాడు. ఈ విషయం మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్ లో గణేష్ స్వయంగా స్టేజి పైన చెప్పాడు. ఈ చిత్రానికి వాస్తవంగా పవన్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా చేస్తున్నాడట. కానీ గణేష్ తో పవన్ సినిమా హిట్టయితే మాత్రం సగం నీకు సగం నాకు అని చెప్పి ఓ ఒప్పందం చేసుకున్నారట. ఈ సినిమా కోసం గణేష్ బాబు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టాడని అంటున్నారు. సినీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై ఉన్న హైప్ బట్టి చిత్రం టోటల్ రూ. 40 కోట్ల వసూళ్లు సాధించ వచ్చని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన డబ్బులను కలుపుకుంటే ఓవరాల్‌గా రూ. 32 కోట్ల లాభం వస్తుందని అంచనా వేస్తున్నారు.
పెట్టబడి పోను వచ్చిన లాభంలో చెరిసగం పంచుకోగా పవన్ కి 16 కోట్ల షేర్ వస్తుంది. ఈ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ అత్యధిక మొత్తం రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డు సృష్టిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. సో ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయంసాధిస్తే తప్ప ఇది జరగదు. కాబట్టి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more