ఉత్తరాంధ్రలోని బాక్సైట్ నిక్షేపాలను కొన్ని సంస్థలకు కట్టబెడుతూ వైయస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, నిబంధనలు ఉల్లంఘించి బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ ఆయన గవర్నర్‌కు లేఖ రాసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ ఆ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై మరో పిడుగు పడింది. వైయస్ రాజశేఖర రెడ్డిని నిర్ణయాన్ని తప్పు పడుతూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసినట్లు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలను వైయస్సార్ రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని సంస్థలకు కేటాయించారనేది కిశోర్ చంద్రదేవ్ ప్రధాన ఆరోపణగా టీవీ చానెల్ వార్తాకథనాన్ని బట్టి తెలుస్తోంది.
ఆ టీవీ చానెల్ వార్తాకథనం ప్రకారం - గవర్నర్‌కు కిశోర్ చంద్రదేవ్ రాసిన 15 పేజీల లేఖ తమ వద్ద ఉందని ఆయన చానెల్ తెలిపింది. జిందాల్, రస్ ఆల్‌ఖైమాలకు అక్రమంగా బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమంగా అనుమతులు ఇచ్చారని కిశోర్ చంద్రదేవ్ తన లేఖలో ఆరోపించారు. దాంతోనే ఆ ప్రాంతంలో అలజడి చెలరేగిందని, ఇది శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉందని ఆయన గవర్నర్‌కు రాసిన లేఖలో చెప్పారు.రాజ్యాంగబద్దంగా సంక్రమించిన విచక్షణాధికారాలను ఉపయోగించి, అనుమతులను రద్దు చేయాలని ఆయన గవర్నర్‌ను కోరారు. కిశోర్ చంద్రదేవ్ రాసిన లేఖ విషయాన్ని గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు తెలిపినట్లు సమాచారం. దానిపై తనను ఏం చేయమంటారని గవర్నర్ రాష్ట్రపతిని అడిగారు. గవర్నర్ రాష్ట్రపతిని కలిసి ఆ విషయాన్ని వివరించినట్లు ఆ చానెల్ తెలియజేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more