శత్రువు బలహీనతపై దెబ్బకొట్టడం ద్వారా తన బలం పెంచుకోవాలన్న సిద్ధాంతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆచరణలో అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీన పరచటం ద్వారా భవిష్యత్తులో తానే నెంబర్‌వన్‌గా నిలవాలని భావిస్తున్న జగన్, ఆ మేరకు టీడీపీ బలహీ నతలపై అన్వేషణ మొదలుపెట్టారు. ప్రధానంగా... సుదీర్ఘకాలం నుంచీ బాబుకు మద్దతుదారులుగా ఉంటూ, పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన కోటరీపై జగన్ దృష్టి సారించారు. బాబుతో ఉన్నా తమకు భవిష్యత్తు లేదని, ఆయన కోసం ఎంత పనిచేస్తున్నా భవిష్యత్తులో కూడా తమకు ఎలాంటి అవకాశాలూ రావన్న అసంతృప్తితో ఉన్న వారిని గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకున్న జగన్.. ఆ మేరకు వారిపై వల వేస్తున్నారు. వీరిలో ప్రధా నంగా కమ్మ, కాపు, రెడ్డి వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.
మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా డబ్బున్న వారికే బాబు ప్రాధాన్యం ఇస్తున్నందున, మీరు కోరుకునే తమ పార్టీలోకి రావాలంటూ జగన్ విధేయ బృందం రంగంలోకి దిగి, వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. కోస్తాతో పాటు, తెలంగాణలోని ఐదారు జిల్లాల్లో ప్రభా వితం చేయగల కమ్మ సామాజిక వర్గంలో నెలకొన్న అసం తృప్తిని గమనించిన జగన్ తమ విధేయ బృందాల ద్వారా వారితో మంతనాలకు తెరలేపినట్లు సమాచారం. బాబుతో ఉంటే భవితవ్యం ఉండదని, మీ సామాజికవర్గాన్ని ఆయన ఎప్పటికీ ప్రోత్సహించరని, తమ వెంట వస్తే కీలక పదవులతో పాటు, సముచిత స్థానం ఇస్తామని జగన్ విధేయ బృందం ముందస్తు ఆశలు కల్పిస్తోంది. జిల్లాల్లో పట్టు, పలుకుబడితో పాటు జిల్లాలను శాసించ గల స్థాయి ఉన్న మాజీ మంత్రులు, సీనియర్లపై జగన్ దృష్టి సారిస్తున్నారు. ముందు వారి వద్దకు తన విధేయ బృందాన్ని పంపించడం, ఆ తర్వాత తానే అవసరం ఉన్న వారితో మాట్లా డటం చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత వద్దకు ఇదేవిధంగా కొద్దికాలం క్రితం జగన్ విధేయ బృందం వెళ్లింది.
అయితే, తాను రాజకీయాల నుంచయినా విరమించుకుంటాను తప్ప పార్టీ మారేది లేదని, బాబుతో తమకు విబేధాలున్నప్పటికీ తాము ఆయన పద్దతులనే తప్ప, నాయకత్వాన్ని వ్యతిరేకించటం లేదని స్పష్టం చేశారు. ఈవిధంగా కొందరు సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. నర్సరావుపేట, ఖమ్మం, గుంటూరు, ఒంగోలు వంటి లోక్‌సభ నియోజకవర్గాల్లో కమ్మ అభ్యర్ధులనే నిలపాలని ఇప్పటికే నిర్ణయించారు. బాబు విధానాలు, ఒంటెత్తు పోకడలు, జిల్లాల్లో నేతల మధ్య దూరం పెంచుతున్న వైఖరితో చాలామంది సీనియర్లు విసిగి వేసారిపోయారని, బాబు ఇక మారరని సీనియర్లు నిర్థరించుకున్న విషయాన్ని పసిగట్టిన జగన్ విధేయ బృందం వారితో మంతనాలు జరుపుతోంది. మీరు పార్టీలోకి వస్తే జిల్లా నాయకత్వాన్ని మీకే అప్పగిస్తామని, మీరు చెప్పినట్లే చేస్తామని హామీలిస్తున్నారు. బాబు వెంట ఉంటే జనం మిమ్మల్ని కూడా నమ్మరని, మునిగిపోయే నావలో ఎంతకాలం ప్రయాణిస్తారని, తెలంగాణలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని , కోస్తాలో తమ పార్టీ విజయం సాధిస్తుందని అనేక సర్వేలు చెప్పిన విషయాన్ని వారు టీడీపీ నేతల వద్ద స్పష్టం చేస్తున్నారు. బాబుకు జనంలో విశ్వసనీ యత పోయిందని, ఆయనతో ఉంటే మిమ్మల్ని కూడా విశ్వసించరని చెబుతున్నారు. ఇటీవల రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకుని డీలా పడిన నాయకులపై జగన్ విధేయ వర్గం వల వేసింది. రోజూ టీవీ చర్చలు, విలేకరుల సమావేశాల్లో ప్రత్యర్థులపై సమర్థవంతంగా ఎదురుదాడి చేసే వారిని గుర్తించింది.
అందులో భాగంగా.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సీనియర్ బీసీ నేతతో రెండు రోజుల క్రితం జగన్ విధేయ బృందం మంతనాలు జరిపినట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌లో బలమైన ఓ బీసీ నేతతో మాట్లాడాలని జగన్‌ను ఆయన విధేయబృందం సూచించినట్లు తెలిసింది. కోస్తాలో కమ్మ వర్గంతో పాటు... బలమైన బీసీ నాయకులను పార్టీలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విశాఖ, నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో టీడీపీ బీసీ నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికలతో వెళుతున్నారు. పార్టీకి జిల్లాల్లో ఎవరికయితే పట్టు ఉంటుందో వారిని తీసుకోవాలన్న వ్యూహం అనుసరిస్తోంది. పోయిన చోటనే వెతుక్కోమన్న సిద్ధాంతాన్ని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలస్యంగా నయినా అమలు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం వల్ల పార్టీ నష్టపోయిందో, తిరిగి అదే సామాజికవర్గం దరికి చేరేందుకు సిద్ధమవుతున్నారు.
గత ఎన్నికల్లో కాపు వర్గానికి చెందిన చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టడంతో ఆ వర్గానికి చెందిన వారంతా పీఆర్పీకి ఓట్లేశారు. పీఆర్పీ 74 లక్షల ఓట్లు సాధిం చగా.. అందులో సగానికిపైగా ఓట్లు తెలుగుదేశం పార్టీవే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోయిన ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునేందుకు టీడీపీ నాయకత్వం కోస్తాలో కాపు, రాయలసీమలో బలిజ వర్గానికి చేరువయేందుకు ప్రణాళిక రూపొందించింది. జగన్ పార్టీకి రెడ్లు-క్రైస్తవులు-ముస్లింలు దన్నుగా నిలిచిన నేపథ్యంలో సీమలో బలిజ, కోస్తాలో కాపులను ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పీఆర్పీ వెంట వచ్చిన కాపు, బలిజలకు సముచిత స్థానం కల్పించకపోవడం ఆ రెండు వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి.. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి వరకూ ఏ స్థాయిలోనూ పీఆర్పీ నుంచి వచ్చిన తమ సామాజికవర్గాన్ని ప్రోత్సహించకపోగా, నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. మంత్రి సి.రామచంద్రయ్య కూడా ఇటీవల ఇలాంటి ఆవేదనే వెలిబుచ్చారు. పీఆర్పీకి చెందిన బలిజ-కాపు శ్రేణులంతా తాము కాంగ్రెస్‌లో అంటరానివారిగా మిగిలిపోతున్నామన్న భావనతో కుమిలిపోతున్నారు.
ఈ అసంతృప్తిని సద్వినియోగం చేసుకునేందుకు టీడీపీ నాయకత్వం రంగంలోకి దిగింది. తొలుత తిరుపతిలో బలిజ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకుంది. ఆయనను తిరుపతి అభ్యర్ధిగా ప్రకటించనున్నారు. ఆ తర్వాత అదే సామాజికవర్గానికి చెందిన కడప జిల్లా రాజంపేటకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ పసుపులేటి బ్రహ్మయ్యను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఆయనను రానున్న ఉప ఎన్నికల్లో అక్కడ అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండల్రాయుడు తనయుడు సుబ్రమణ్యంను రానున్న రాయచోటి ఉప ఎన్నికల బరిలో దించనున్నారు. అంటే కడప జిల్లాలో జరిగే మూడు స్థానాల్లో రెండు స్థానాలను బలిజ వర్గానికే ఇవ్వనున్నారు. బలిజ వర్గానికి చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు తనయుడు శ్రీనివాస్‌ను కూడా చేర్చుకుంటున్నారు. ఈయన కూడా టీడీపీ నుంచి పీఆర్పీకి వెళ్లిన నాయకుడే. ఆయనను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట నుంచి బరిలో దింపనున్నారు. ఈవిధంగా రాయలసీమలో మొదటి నుంచి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న బలిజ వర్గం తిరిగి తన వైపు మళ్లించుకున్నట్టయితే.. రాయలసీమలో జగన్‌ను సులభంగా ఎదుర్కోవచ్చని భావిస్తోంది. అదేవిధంగా.. కోస్తాలోని ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కాపులపైనా టీడీపీ నాయకత్వం వల వేస్తోంది.
పీఆర్పీ స్థాపించకముందు కోస్తా కాపులలో 50 శాతం మంది కాపులు టీడీపీలోనే కొనసాగారు. ఇప్పుడు అక్కడ కూడా కాపులు పీఆర్పీతో పాటు కాంగ్రెస్‌లోకి అనవసరంగా వచ్చామన్న అసంతృప్తితో ఉన్న వారిని ఆకర్షించేందుకు వ్యూహరచన ప్రారంభించింది. అసంతృప్తితో ఉన్న కాపు నేతలను గుర్తించి వారిని తిరిగి పార్టీలోకి తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు పార్టీ సీనియర్లు ఈ ప్రయత్నాలను అడ్డుకున్నా వారిని ఖాతరు చేయకూడదని నిర్ణయించుకుంది. అసలు సీనియర్ల వల్లే చాలామంది కాపు నేతలు పార్టీలోకి రాకుండా పోయారన్న భావనతో ఉన్న నాయకత్వం ఈసారి సీనియర్ల అభ్యంతరాలను ఖాతరు చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more