ముంబాయిలో 1962 మే 27న జన్మించిన రవిశంకర్ జయధ్రిత శాస్త్రి మాజీ క్రికెట్ కెప్టెన్. ఆటగాడుగా 18 సంవత్సరాల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు ఇండియాకు ప్రాతినిద్యం వహించాడు. 1985లో జరిగిన ప్రపంచ చాంపియన్ క్రికెట్లో తన క్రీడా జీవితంలోనే అత్యంత ప్రతిభను కనబర్చి చాంపియన్ ఆప్ చాంపియన్స్ గా ఎన్నికైనాడు. రవిశాస్త్రీ ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా 2007లో బంగ్లాదేశ్ పర్యటించిన భారత జట్టుకు తాత్కాలిక కోచ్ గా వ్యవహరించాడు.
అయితే ఇప్పుడు టీమిండియా దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ పై వస్తున్న జోకులను ఆయన సీరియస్ గా తీసుకుంటున్నాడు. సచిన్ పై ఎలాంటి జోకులు వేయవద్దని రవిశాస్త్రీ కోరుకుంటున్నాడట. సచిన్ గురించి ఇతర క్రికెటర్స్ మాట్లాడవద్దని కూడా రవిశాస్త్రీ చెబుతున్నాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు సచిన్ పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారు ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని రవిశాస్త్రీ అంటున్నారు. ఒక రవిశాస్త్రీ కాకుండా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా సచిన్ పై ఎలాంటి విమర్శలు చేయకండి అని చెబుతున్నాడని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు అంటున్నారు.
రోటేషన్ లో భాగంగా విశ్రాంతినివ్వడాన్ని మాజీ కెప్టెన్ రవిశాస్త్రీ తప్పుబట్టాడు. అదో జోక్ . సచిన్ ఉంటే అది బలమైన జట్టు. వందో వంద ముంగిట ఉన్న సచిన్కు దాన్ని సాధించే అవకాశం కల్పించాలి. రెండు మూడు నెలల్లో అతను వన్డేల నుంచి తప్పుకోనున్నాడు. సచిన్ కేరిర్ ఈ స్థితిలో ఉన్నపుడు రోటేషన్ అమలు చేయడమేంటి? అని శాస్త్రీ ప్రశ్నించాడు.
టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌తో ప్రయోగాలొద్దని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అంటున్నాడు. ఇది భారత జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అక్రమ్ హెచ్చరిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా అవలంబిస్తున్న రొటేషన్ విధానం ఉపఖండం జట్లకు సరిపడదని అన్నాడు. సచిన్ జట్టులో ఉంటే ప్రత్యర్థి మానసికంగా బలహీనపడతాడని చెబుతున్న అక్రమ్.. గాయపడితే తప్ప మాస్టర్‌కు విశ్రాంతినివ్వొద్దని సూచించాడు. ఒకవేళ రొటేషన్ తప్పదనుకుంటే అది జట్టులోని ఆటగాళ్లందరికీ అమలు చేయాలని అన్నాడు. వందో శతకానికి ఒక అడుగు దూరంలో ఉన్న సచిన్‌కు రెస్ట్ ఇవ్వాలనేది తప్పుడు నిర్ణయమని చెప్పాడు. అంతేకాకుండా ఎప్పుడు వైదొలగాలనే నిర్ణయం మాస్టర్‌కే వదిలేయాలన్నాడు. '2015 ప్రపంచకప్‌లో మాస్టర్ అడాలనుకుంటే మంచిదేనని వసీం అంటున్నాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more