Ganesh gets a treat with a Swathimuthyam teaser trailer వన్యప్రాణుల చట్టానికి తూట్లు.. సీఎం, సద్గురుపై కేసులు

Bellamkonda ganesh swathimuthyam trailer fun coated content raises expectations

Swathi Muthyam, Bellamkonda Ganesh, varsha, Lakshman K Krishna, Mahathi Swara Sagar, Sithara Entertainments, Tollywood, Movies, Entertainment

The theatrical trailer of Bellamkonda Ganesh’s debut film, Swathimuthyam is unveiled by the makers this morning. Co-starring Varsha Bollamma as the female lead, the little more than 2 minutes promotional video revolves around a series of incidents between the lead pair.

ఆకట్టుకుంటోన్న బెల్లంకొండ గణేశ్ ‘స్వాతిముత్యం’ ట్రైలర్..

Posted: 09/27/2022 03:29 PM IST
Bellamkonda ganesh swathimuthyam trailer fun coated content raises expectations

టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గ‌ణేశ్ న‌టిస్తోన్న తాజా చిత్రం స్వాతిముత్యం. దసరా పండగను పురస్కరించుకుని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ఇవాళ ట్రైల‌ర్‌ను లాంఛ్ చేశారు. హీరోహీరోయిన్లు గ‌ణేశ్, వ‌ర్ష బొల్ల‌మ్మ ప్రేమలో పడతారు. ఇద్దరికీ ఒక‌రికోకరు నచ్చుతారు. అయితే ఈ విషయాన్ని వారింట్లో చెప్పాల్సిన విషయంలో వారు కొంత మీమాంసలో పడతారు. ఈలోగా వారి ప్రేమ ప్ర‌యాణం అంతా స‌వ్యంగా సాగుతుందని అనుకుంటున్న స‌మ‌యంలో వారి కుటుంబసభ్యులు మరో విధంగా తలుస్తారు.

ఇద్ద‌రికి వేర్వేరు పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేస్తారు వారివారి కుటుంబ‌స‌భ్యులు. అయితే కుటుంబసభ్యులను ఎదరించి వీరు పెళ్లి చేసుకుంటారా.? లేక వారిని ఓప్పించి పెళ్లి చేసుకుంటారా.? అన్నదే ఈ చిత్ర కథ. అయితే ఈ ఓప్పించడం, నోప్పించడంలో హీరో పడిన కష్టాలు ఏంటీ.. హీరోయిన్ పడిన బాధలేంటీ అన్నది కథాంశం. అయితే వారి పెళ్లి చేసుకునే సందర్భంలో జీవితంలో ఎలాంటి స‌మ‌స్యలు ఎదుర్కొన్నారనే క‌థాంశంతో సినిమా సాగ‌నున్న‌ట్టు ట్రైల‌ర్‌తో చెప్పేశాడు ద‌ర్శ‌కుడు.

ల‌క్ష్మ‌ణ్ కే కృష్ణ సంభాష‌ణ‌లు, ఫ్యామిలీ ఎమోష‌న్స్, హీరోహీరోయిన్ల ల‌వ్ ట్రాక్‌తో మూవీ ల‌వ‌ర్స్‌ను ఇంప్రెస్ చేసేలా సినిమా ఉండ‌బోతుంద‌ని ట్రైల‌ర్‌తో తెలిసిపోతుంది. ఎప్ప‌టిలాగే వెన్నెల కిశోర్ త‌న‌దైన కామెడీ స్టైల్‌తో ప్రేక్ష‌కుల్లో న‌వ్వులు పూయించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సూర్య కెమెరా వ‌ర్క్ చేస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ల‌క్ష్మ‌ణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రావు ర‌మేశ్‌, ప్ర‌గ‌తి, న‌రేశ్, స‌ప్త‌గిరి కీ రోల్స్ చేస్తున్నారు. అక్టోబ‌ర్ 5న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles