Biopic on Olympic medallist Abhinav Bindra is on cards అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

harsh varrdhan kapoor, abhinav bindra biopic, update on abhinav bindra biopic, harsh varrdhan kapoor on abhinav bindra biopic, harsh varddhan kapoor upcoming movies, abhinav bindra biopic update

Harsh Varrdhan Kapoor announced on Instagram that he will appear next in the biopic of Olympic Gold Medalist Abhinav Bindra. However, little did anyone know the hardships the film would face before going on floors!

అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

Posted: 09/16/2022 08:41 PM IST
Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్) అభిన‌వ్ బింద్రా సినిమా కూడా ఉంది. 2017లో అనిల్ క‌పూర్ కుమారుడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ క‌పూర్ లీడ్ రోల్ ఈ సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు దీనిపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా దీనిపై ఓ న్యూస్ బీటౌన్ స‌ర్కిల్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్ క‌పూర్‌.

బ‌యోపిక్ ప్రాజెక్టును మొద‌లుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని, వ‌చ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని క్లారిటీ ఇచ్చాడు. అభిన‌వ్ బింద్రా పాత్ర కోసం హోం వర్క్ చేయాల్సి ఉంది. అలాంటి లెజెండ‌రీ ప్లేయ‌ర్ మీద సినిమా చేసేట‌పుడు ప్ర‌తీ నిమిషాన్ని ప‌ర్‌ఫెక్ట్‌గా క్యాప్చ‌ర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ బ‌యోపిక్‌లో అభిన‌వ్ బింద్రా తండ్రి పాత్ర‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ తండ్రి అనిల్ క‌పూర్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ క్రేజీ సినిమాపై రానున్న రోజుల్లో మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. ఇప్ప‌టికే క్రికెట్‌, క‌బ‌డ్డీ, హాకీ, ఆర్చ‌రీ నేప‌థ్యంలో బ‌యోపిక్‌లు తెర‌పై సంద‌డి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh