Karthikeya 2 Continues Sensational Run at Box Office నిఖిల్ ‘కార్తికేయ-2’: 30 రోజుల్లో రూ.120 కోట్లు దాటి..

Nikhil siddhartha s karthikeya 2 movie collections worldwide for 30 days

Karthikeya 2, Telugu Movie, Nikhil Siddhartha, Anupama Parameshwaran, Anupam kher, Chandu Mondeti, kaala bhairava, TG Vishwa Prasad, Abhishek Agarwal, OTT Platform, Zee 5, Tollywood, Bollywood, Movies, Entertainment

Karthikeya 2 is the career’s biggest hit for both the lead actor, Nikhil Siddhartha and the director, Chandoo Mondeti. Karthikeya 2 makers posted an official poster on Twitter mentioning the records made by the film. The film collected more than 120 crores gross worldwide in 30 days of its theatrical run.

నిఖిల్ ‘కార్తికేయ-2’: 30 రోజుల్లో రూ.120 కోట్లు దాటి..

Posted: 09/12/2022 12:59 PM IST
Nikhil siddhartha s karthikeya 2 movie collections worldwide for 30 days

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ప్రముఖ దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ‌-2’ మూడు పదల రోజులు దాటినా ఇంకా దేశంలోని పలుప్రాంతాల్లో తన హ‌వాను కోనసాగిస్తూనే ఉంది. సినిమా విడుద‌లై నెల రోజులు కావస్తున్నా కార్తికేయ‌-2 క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎన్నో వాయిదాల త‌ర్వాత ఆగ‌స్టు 12న విడుద‌లైన ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్‌గా నిలిచింది. కేవ‌లం తెలుగులోనే కాకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లోనూ ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్‌లను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘బాహుబ‌లి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రాల త‌ర్వాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. కేవ‌లం విడుద‌లైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ఈవెన్‌ను పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం 30రోజులు పూర్తి చేసుకుంది. ఇక ముప్పై రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.120 కోట్ల‌ను సాధించింద‌ట‌. అంతేకాకుండా వెయ్యి స్క్రీన్‌ల‌లో ఈ చిత్రం ముప్పై రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం తెలుగులో ‘గీతా గోవిందం’ త‌ర్వాత అత్య‌ధిక ప్రాఫిట్స్‌ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles