Sharwanand's next to go on the floors soon తొలిసారి రాశీఖన్నాతో శ‌ర్వానంద్.. గ్రామీణ నేపథ్యంలో..

Sharwanand and raashii khanna s film starts rolling next week

Sharwanand, Raashii Khanna, People Media Factory, Krishna Chaitanya, Sharwanand next, Sharwanand upcomming movies, Sharwanand latest news, Sharwanand photos, Sharwanand movies, Sharwanand songs, Rashi khanna movies, Rashi khanna next, Tollywood, movies, Entertainment

Sharwanand is now all set to begin a new film. After a gap of eight months, he is launching a new film. Writer and director Krishna Chaitanya will helm this new film featuring Sharwanand as the hero and Raashii Khanna as the female lead. Sharwanand and Rasshii Khanna are pairing together for the first time.

తొలిసారి రాశీఖన్నాతో శ‌ర్వానంద్.. గ్రామీణ నేపథ్యంలో..

Posted: 09/03/2022 04:59 PM IST
Sharwanand and raashii khanna s film starts rolling next week

హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధంలేకుండా వ‌రుస సినిమాల‌తో ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు శ‌ర్వానంద్‌. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో హీరోగా వైవిధ్య‌త‌ను చాటుకుంటున్నాడు. అయితే చాలా కాలంగా ఈయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డం లేదు. నిజానికి 2017లో వ‌చ్చిన ‘మ‌హానుభావుడు’ సినిమా త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు శ‌ర్వాకు హిట్టులేదు. అయితే ఫ‌లితం ఎలా ఉన్నా శ‌ర్వా మాత్రం వ‌రుసగా సినిమాల‌ను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘ఓకే ఒక జీవితం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం శ‌ర్వాకు 30వ సినిమాగా తెర‌కెక్కింది. కాగా శ‌ర్వానంద్ ఇప్పుడు త‌న 31వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు.

శ‌ర్వానంద్ త‌న నెక్స్ట్ మూవీని ‘ఛ‌ల్ మోహన్‌రంగ’ ఫేం కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఇప్ప‌టికే అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన ఈ చిత్రం వ‌చ్చే వారం సెట్స్ మీద‌కు వెళ్ళ‌నుంద‌ట‌. ఈ మూవీ లాంఛింగ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంద‌ట‌. రూర‌ల్ బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో ఫుల్ రానెస్‌తో ఈ సినిమా తెరకెక్క‌నుంద‌ట‌. ఈ చిత్రంలో శర్వా ఇప్ప‌టివ‌ర‌కు చూడని డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అంతేకాకుండా శ‌ర్వా ఈ మూవీలో డీ గ్లామ‌ర్ పాత్ర పోషించ‌నున్న‌ట్లు టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై విశ్య ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శ‌ర్వాకు జోడీగా రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

ప్ర‌స్తుతం శ‌ర్వా న‌టించిన ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అక్కినేని అమ‌ల కీల‌క‌పాత్ర పోషించింది. శ‌ర్వాకు జోడీగా రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. డ్రీమ్ వారియ‌ర్స్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్‌.ఆర్ ప్ర‌కాష్ బాబు, ఎస్‌.ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles