Karthikeya 2 continues to rule Box office వంద కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతున్న ‘కార్తికేయ 2’

Karthikeya 2 box office collection nikhil siddhartha starrer earns rs 70 crore in 9 day

Karthikeya 2, Nikhil, Nikhil Siddharth, Anupama Parameswaran, Nikhil karthikeya 2, Anupama karthikeya 2, chandoo mondeti, chandoo mondeti karthikeya 2 suniel shetty, box office collections, Tollywood, Bollywood, Movies, Entertainment

Karthikeya 2, starring Nikhil Siddharth and Anupama Parameswaran, released in theatres on August 13, and has successfully crossed ten days. The supernatural thriller is directed by Chandoo Mondeti. Karthikeya 2 seems to have had another good weekend. With no real competition at the box office and with the endorsement of superstars like Pawan Kalyan, the film has done solid business across the Telugu states.

వంద కోట్ల క్లబ్ దిశగా పరుగులు పెడుతున్న ‘కార్తికేయ 2’

Posted: 08/23/2022 08:54 PM IST
Karthikeya 2 box office collection nikhil siddhartha starrer earns rs 70 crore in 9 day

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిదార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 చిత్రం బాక్సీఫీసు వద్ద సవ్వడి కొనసాగిస్తోంది. నిఖిల్-చందూ మొండేటి కాంబినేషన్లో రూపొందిన 'కార్తికేయ' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో కొన్నేళ్ల తరువాత కార్తీకేయ-2 చిత్రాన్ని రూపోందించారు. ఈ చిత్రాన్ని ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ రహస్యం ఏమిటన్నది తెలుసుకోవడానికి ద్వారకలో హీరో సాగించే అన్వేషణే ఈ సినిమా కథ.

ట్రైలర్, టీజర్ సహా ఇతర ప్రమోషన్ తో అంచనాలు పెంచేసిన చిత్రం.. విడుదలైన తొలి రోజునే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక దీనికి తోడు సినిమాలోని నటీనటులతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సహా చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సినిమా బాగుందని ట్విట్టర్ సహా సామాజిక మాద్యమాల్లో స్పందించడంతో.. ఈ చిత్రం కలెక్షన్లు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ లో ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రెండు రోజులు అంతంత మాత్రంగా ఉన్న కలెక్షన్లు అమాంతం పెరిగిపోయాయి.

బాలీవుడ్ టాప్ చిత్రాలను తోసిరాజుతూ బాలీవుడ్ లోనూ కార్తీకేయ 2 చిత్రం దూసుకుపోతోంది. తొలి రోజున అక్కడ 200 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 3వ రోజుకి 700 థియేటర్లకి వెళ్లింది. 'శ్రీకృష్ణ జన్మాష్టమి' రోజున ఈ సినిమాకి అమాంతంగా వసూళ్లు పెరిగిపోయాయి. ఇంతవరకూ ఒక్క హిందీలోనే 15 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 75.33 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమని చెబుతున్నారు. తెలుగు వెర్షన్ వరకూ చూసుకుంటేనే, నిఖిల్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles