దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకుంది. ఓ ఆడియో ఫంక్షన్లో సాయిపల్లవి క్రేజ్ చూసి సుకుమార్.. ‘లేడి పవర్ స్టార్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గుడపుతుంది.
ఇటీవలే ఈమె నటించిన ‘గార్గి’ విడుదలై ఘన విజయం సాధించింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సాయిపల్లవి తన సహజ నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. కాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘గార్గి’ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఆగస్టు 12 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలకు నాలుగు వారాలకు డిజిటల్లో విడుదలవుతుంది. ఈ మధ్య చాలా వరకు సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన గార్గి కేవలం వారంలోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేశాడు. సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more
Jul 21 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్... Read more