నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘కృష్ణమ్మ’ ఒకటి. ఇటీవలే ‘గాడ్సే’తో ప్రేక్షకులను నిరాశపరిచిన సత్యదేవ్ ఈ సారి కృష్ణమ్మతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని కసితో ఉన్నాడు.
ఈ క్రమంలోనే మొదటి సారి పూర్తి స్థాయి యాక్షన్ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సాయిధరమ్ తేజ్ విడుదల చేశాడు. ‘ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవ్వడికి తెలియదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా, పుట్టిన ప్రతి ఒకడికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. కథ నడక, నది నడక ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడు గెలక్కూడదు. కానీ గెలికారు’ అంటూ సత్యదేవ్ పలికే సంభాషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
సత్యదేవ్ మొదటి సారిగా ఓ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో అంచనాలు నెలకొల్పయి. ఇక తాజాగా విడులైన టీజర్ అంచనాలను అమాంతం పెంచింది. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా అతిరా రాజీ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Jul 21 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్... Read more