కెరీర్‌లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజా ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ఒకటి. శరత్‌మండవ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది.
ప్రపంచవ్యాప్త తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానున్న క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ఇస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’, ‘సొట్ట బుగ్గల’, నా పేరు సీసా సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ మరో అప్‌డేట్‌ను ప్రకటించారు. ‘కింగ్ ఆఫ్ ది క్రౌడ్’ అంటూ సాగే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను జూలై 22న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చిందర వందరగా పడిఉన్న ఫైల్స్ మధ్యలో నిల్చుని రవితేజ ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు.
మాస్ మహరాజ్ రామారావుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈ స్టిల్ లో ఆయన నీడ చెస్‌లోని కింగ్ సింబల్‌ను సూచిస్తుంది. రవితేజకు జోడీగా ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్‌టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more