Kamal Haasan To Team Up With Mass Director మాస్ దర్శకుడితో జతకట్టనున్న విశ్వనటుడు

Kamal haasan to team up with mass director muthiah for his next

Mutraiah, Kamal Haasan, Thevar Magan, Virumaandi, Muthaiah, Kamal Haasan M Muthaiah buzzed project, Kamal Haasan to team up with Muthaiah, Kamal Haasan next, Vikram, Lokesh Kanagaraj, Vijay Sethupathi, Malayalam actor Fahadh Faasil. Kalidas Jayaram, Kollywood, movies, Entertainment

Kamal Haasan will be teaming up with director Muthiah for his next. The film is set to be based on a commercial setting in an entirely rural setting. Already Kamal has won millions of hearts with his roles in Virumandi and Thevar Magan against the village background. Muthiah is also famous for his style of films based on rural setup.

మాస్ దర్శకుడు ముత్తయ్యతో జతకట్టనున్న విశ్వనటుడు

Posted: 05/17/2022 03:43 PM IST
Kamal haasan to team up with mass director muthiah for his next

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వ‌చ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా క‌థ‌ల‌ను ఎంచుకుంటూ యువ హీరోల‌కు ధీటుగా సినిమాల‌ను చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన విక్ర‌మ్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ‘మాస్ట‌ర్’ ఫేం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంపై మొద‌టి నుంచి ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత క‌మ‌ల్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు.

‘రాయుడు’ ఫేం ముత్త‌య్యతో క‌మ‌ల్ నెక్స్ట్ సినిమాను చేయ‌నున్నట్లు గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ అఫిషియల్‌గా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా జ‌రిగిన ‘విక్ర‌మ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పా. రంజిత్, క‌మ‌ల్‌తో త‌న త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ముధురై బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్లు.. క‌మ‌ల్ న‌టించిన వీరుమండి (పోతురాజు) సినిమా త‌ర‌హాలో ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. క‌బాలి, కాలా, సార్పట్ట‌ ప‌రంప‌ర వంటి సినిమాల‌ను తెర‌కెక్కించ‌న పా.రంజీత్, క‌మ‌ల్‌తో నెక్స్ట్ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ప్రేక్ష‌కుల‌లో తీవ్ర ఆస‌క్తి నెల‌కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mutraiah  Kamal Haasan  Thevar Magan  Virumaandi  Muthaiah  Vikram  Lokesh Kanagaraj  Vijay Sethupathi  Kollywood  

Other Articles