Veteran producerNarayan Das Narang passes away ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూత

Prominent film producer asian group chairman narayan das narang passed away

Narayan Das Narang, Narayan das narang dies, narayan das narang passes away, mahesh babu, narayan das narang producer, Narayan Das Narang, asian group Chairman, Asian cinema, tollywood producer, Chiranjeevi, Tollywood Celebrities, Mahesh babu, Tollywood, movies, Entertainment

Noted film producer and chairman of Asian Group, Narayan Das Narang, passed away. He was undergoing treatment at Star Hospitals in the city. He was said to be suffering with age-related health issues for the last few months. He worked predominantly in the Tamil movie industry. He produced movies like D 46, The Ghost, Lakshya, and Love Story. Das was also a prominent financier and exhibitor.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూత

Posted: 04/19/2022 03:14 PM IST
Prominent film producer asian group chairman narayan das narang passed away

నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ , ఏషియన్‌  థియేటర్స్‌ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ఇటీవల నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్‌’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్‌ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఆయ‌న డిస్ట్రిబూట‌ర్‌గా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను విడుద‌ల చేశారు. నిర్మాత‌గా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియ‌ర్ గ్రూప్ అధినేత గ్లోబ‌ల్ సినిమా స్థాప‌కుడు, ఫైనాన్సియ‌ర్‌కూడా ఆయిన ఆయ‌న చ‌ల‌న‌చిత్రరంగంలో అజాత‌శ‌త్రువుగా పేరుగాంచారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.  ఈరోజు సాయంత్రం 4గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలియ‌జేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles