Payal Rajput to play Swathi in ‘Gali Nageshwar Rao’ పాయల్ రాజపుత్ ఆశలన్నీ ‘గాలి నాగేశ్వరరావు’పైనే.!

Payal rajput to play swathi in vishnu manchu s gali nageshwar rao

Gali Nageshwara Rao, Manchi Vishnu, Payal Rajput, Eeshaan Surya, G Nageshwar Reddy, Anup Rubens, Jeffrey Gee Chin, Mosagallu, Kajal Aggarwal, RX100 actress, social media, vi anand, Disco Raja, ravi teja, gali nageshwara rao, kona venkat, Tollywood, Movies, Entertainment

Payal Rajput has been roped in to play the female lead in the Gali Nageshwar Rao which is billed to be a comedy entertainer, and she is said to be excited about the project as this is her first mainstream Telugu film in the last two years.

పాయల్ కు ‘గాలి నాగేశ్వరరావు’ విజయాన్ని అందించేనా.!

Posted: 04/09/2022 09:25 PM IST
Payal rajput to play swathi in vishnu manchu s gali nageshwar rao

పాయల్ రాజ్ పుత్ పేరు వినగానే నిలువెత్తు అందం గుర్తుకు వస్తుంది. కైపు కళ్లతో తెరపై ఆమె చేసే గారడీ కుర్రకారును మత్తులో ముంచెత్తుతుంది. అందంతో పాటు అభినయం కూడా పాయల్ లో సమపాళ్లలో కనిపిస్తుంది. అయితే అందాల అరబోతలోనూ కొలమానం పాటించని ఈ అమ్మడుకు అదృష్టమే అందుబాటులోకి రాకుండా తప్పించుకుంటోంది. స్టార్ హీరోల సరసన ఛాన్సులు.. బలమైన హిట్లు పడకపోవడమే ఆమె బలహీనతగా మారిపోయింది. 'డిస్కోరాజా' .. 'వెంకీమామ' వంటి పెద్ద సినిమాలు కూడా ఆమె కెరియర్లో కనిపిస్తాయి.

పాయల్ గ్లామర్ కు ఫుల్ మార్క్ పడినా.. అమెకు యువతలో మంచి క్రేజ్ వున్నా.. అమెకు అవకాశాలు అందడమే సన్నగిల్లాయి. దాదాపుగా రెండేళ్ల తరువాత తెలుగులో అమె తెరపై కనిపించనున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెకు తోడు హాలీవుడ్ బోల్డ్ నటి సన్నీ లియోన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో గాలి నాగేశ్వరరావు టైటిల్ పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. ఆయన హీరోగా తన సోంత బ్యానర్లో నిర్మిస్తున్న 'గాలి నాగేశ్వరరావు' సెట్స్ పైకి వెళ్లింది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సన్నీలియోన్  నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలను మంచువిష్ణు గోప్యంగానే ఉంచారు. ఇదిలావుండగా ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందనే బలమైన నమ్మకంతో పాయల్ ఉంది. మరి ఈ చిత్రం అమెకు విజయాలను అందిస్తుందా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles