Narne Nithin Chandra’s first look from Sri Sri Rajavaru హీరోగా ఎన్టీఆర్ బావమరిది ఎంట్రీ .. ఫస్టులుక్ రిలీజ్!

Jr ntr s brother in law narne nithin chandra to debut with teja s film

Young Tiger Jr NTR, NTR brother-in-law, Nithin Chandra, Sri Sri Sri Raja Vaaru, Vegesna Satish, Sri Vedakshara Movies, movie news, cinema stills, movie HQ photos, actress stills, tollywood, movies updates, movie trailers, Tollywood. Movies, Entertainment

Young Tiger Jr NTR's brother-in-law Narne Nithin Chandra equipping himself with all skills that are necessary to face the camera, is all set to make his debut with Sri Sri Sri Raja Vaaru, a family entertainer with a difference. The film, produced on Sri Vedakshara Movies banner, by Ramarao Chinthapalli and MS Reddy. It is directed by Vegesna Satish, who carved a niche for himself with the award winning 2017 film Shathamanam Bhavati.

హీరోగా ఎన్టీఆర్ బావమరిది ఎంట్రీ .. ఫస్టులుక్ రిలీజ్!

Posted: 03/18/2022 08:41 PM IST
Jr ntr s brother in law narne nithin chandra to debut with teja s film

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎంట్రీకి సంబంధించిన వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వలన ఆయన సినిమాకి సంబధించి ఫస్టులుక్ పోస్టర్ బయటికి రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ సినిమాకి 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. చింతపల్లి రామారావు - ఎమ్మెస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, టైటిల్ తో కూడిన నితిన్ చంద్ర ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

జాతర నేపథ్యంలో నడుస్తూ .. సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్ లో ఆయన మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు.  కైలాస్ మీనన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన సతీశ్ వేగేశ్న, ఈ సారి ఇలాంటి ఒక మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం విశేషం. పైగా ఈ సినిమా టైటిల్ సిగరెట్లతో రాసుండటం కొసమెరుపు. ఈ సినిమాలో నాయిక ఎవరు? జోనర్ ఏమిటి? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles