Nagashaurya's next locks the new release date భారీ సినిమాల మధ్య నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’

Nagashaurya s krishna vrinda vihari release date announced

Krishna Vrinda Vihari, Nagashourya, Nagashourya Krishna Vrinda Vihari, Shirley Setia Krishna Vrinda Vihari, R. Krishna Krishna Vrinda Vihari, Uma Moolpuri Krishna Vrinda Vihari, ira creations Krishna Vrinda Vihari, Krishna Vrinda Vihari release date, Shirley Setia, Radhika, R. Krishna, Mahati Swara Sagar, ira creations, tollywood, movies, Entertainment

Nagashourya is making a movie under the direction of director R. Krishna, While Shirley Setia will be introduced as the heroine in the film. Senior actress Radhika Sarath Kumar will be playing the lead role. The film is being produced by Uma Moolpuri under Nagashourya's own banner ira creations. Krishna Vrinda Vihari Unit revealed the release date of the movie that is 22 april 2022.

జోరుమీదున్న నాగ‌శౌర్య.. భారీ సినిమాల మధ్య ‘కృష్ణ వ్రింద విహారి’

Posted: 03/07/2022 05:43 PM IST
Nagashaurya s krishna vrinda vihari release date announced

వరుడు కావలెను, లక్ష్య చిత్రాలతో ఇటీవల ప్రేక్షకులను పలకరించి.. కరోనా కష్టకాలంలోనూ చిత్రాలను ఫర్వాలేదు అనిపించుకుని యావరేజ్ టాక్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయిన యువనటుడు నాగశౌర్య తగ్గేదే లేదని అంటున్నాడు. బాలకృష్ణ ఆఖండతో ఆరంభమైన సినీమా ధియేటర్లకు ప్రేక్షకుల తాకిడిని అల్లు అర్జున్ పుష్పతో ఫుల్ ఫ్లెడ్జ్ చేయగా, భీమా నాయక్ చిత్రంతో బాక్సులు బద్దలయ్యాయి. ఈ తరుణంలో ఇప్పటికే పూర్తి చేసుకున్న చిత్రాలు అనేకం విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

ఈ తరుణంలో పాన్ఇండియా చిత్రాలు కూడా విడుదలవుతున్నా.. తన సినిమాలను వాయిదా వేసుకుకోకుండా బరిలోకి దిగుతూ తన జోరును కోనసాగిస్తున్నాడు హీరో నాగశౌర్య. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలు ఉన్న కారణంగా ఒక్కోదానిని రిలీజ్ చేసుకుంటూ వెళ్లాలనే యోచనలో వున్నాడు. లేటెస్ట్‌గా ఈయ‌న న‌టించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుద‌లైన నాగశౌర్య ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీను ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అనూహ్యంగా ఏప్రిల్ రేసులోకి వ‌చ్చింది. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. షిర్లీ సేటియా హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టి రాధికా శ‌ర‌త్ కుమార్ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. మ‌హ‌తీ స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి వారం రోజుల ముందు కేజీఎఫ్‌2, బీస్ట్ వంటి పాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles