Bus services to a remote village with a song పార్వతి పాటతో పరుగులు పెట్టిన ఆర్టీసి బస్సు..

Sa re ga ma pa contestant dasari parvathi brings bus service to her home town

Dasari Parvathi, Sa Re Ga Ma Pa, Zee Telugu, APSRTC officials, Bus service, Lakkasagar, Krishna patnam, Kurnool district, TV Clip viral, Social Media, Andhra pradesh

Sa Re Ga Ma Pa is show which is aired in Zee Telugu TV Channel, now this show has become talk of the town with one of its Contestant Dasari Parvathi. As she brings APSRTC Bus service to her remote village Lakkasagar in Krishna patnam Mandal of Kurnool district.

పార్వతి పాటతో పరుగులు పెట్టిన ఆర్టీసి బస్సు.. స్పందించిన యంత్రాంగం

Posted: 02/21/2022 01:38 PM IST
Sa re ga ma pa contestant dasari parvathi brings bus service to her home town

సంగీతంతో తమ గ్రామానికి బస్సు సర్వీసును రప్పించేలా చేసింది ఓ గాయని. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన దాసరి పార్వతీ జీ- సరిగమపలో పాడే అవకాశం దక్కించుకొని.. తన గాత్రంతో న్యాయనిర్ణేతలనే మెప్పించింది. కంటెస్టెంట్ గా వచ్చిన అమె తన పాటతో అందరి మనసులు గెలుచుకుంది. మరి తమ గ్రామానికి అర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఎలా రప్పించుకుందన్న వివరాలు తెలుసుకోవాలని ఉందా.. ఆ వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మ దంపతుల కనిష్ట సంతామనమైన పార్వతి బాల్యం నుంచే పాటలు పాడడంపై ఆసక్తి పెంచుకుంది. అమెలోని గాత్రంలోని నైపుణ్యాన్ని గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. సాధన చేస్తే భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగవచ్చని చెప్పారు. దీంతో పార్వతి ఇంటర్ పూర్తైన తరువాత అమె తల్లిదండ్రులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేర్పించారు. అక్కడ ప్రిన్సిపాల్‌ సుధాకర్, గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద  శిక్షణ తీసు కుంటూ పార్వతి టీటీడీ చానల్‌ ‘అదిగో అల్లదిగో’ కార్యక్రమానికి ఎంపికయ్యారు.

ఇటీవల జీ తెలుగు చానల్‌లో సరిగమప సీజన్ లో పార్వతికి చాన్స్ వచ్చింది. ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడడంతో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రశంసలు కురిపించారు. గేయరచయిత అనంత్ శ్రీరామ్ కూడా అమెను ప్రశంసించారు. పార్వతిని ఏమి కావాలో కోరుకోమని అడగగా.. తాను పడ్డ కష్టాలు తమ గ్రామస్తులు పడకూడదని, తన గ్రామానికి బస్సు తిప్పాలని కోరారు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా లేచి నిలబడి పార్వతికి ధన్యవాదాలు తెలియజేశారు.  

తన కోసం ఏమీ అడగకుండా తన గ్రామం కోసం బస్సు సర్వీసును కోరడంటో అమెలోని మహోన్నత సామాజిక దృక్పథాన్ని అక్కడున్నవారంతా కోనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రోమోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసాయి. లక్షలాది వీక్షకులు తమ మొబైల్‌ ఫోన్ల  నుంచి ఈ పాటను షేర్‌ చేశారు. పార్వతి విన్నపానికి డోన్‌ ఆర్టీసీ అధికారులు స్పందించారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు. డోన్‌ నుంచి దేవనకొండకు వెళ్లే బస్సును లక్కసాగరం మీదుగా తిప్పుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Parvathi  APSRTC officials  Bus service  Lakkasagar  Kurnool district  Andhra pradesh  

Other Articles