DJ Tillu 4 Days box office collections నాలుగు రోజుల్లోనే లాభాలను రాబట్టేసిన డీజే టిల్లు

Sidhu jonnalagadda s dj tillu 4 days box office collections

DJ Tillu, Siddhu Jonnalagadda, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi, Narra Srinivas, Kireeti Damaraju, Vimal Krishna, Sricharan Pakala, Thaman S, Suryadevara Naga Vamsi, Tollywood, movies, entertainment

South Industry's film 'DJ Tillu' is consistently performing well at the box office. Actor Sidhu Jonnalagadda and actress Neha Shetty are in lead roles in this Telugu film. The film was released on 12 February i.e. last Saturday. Where the film earned Rs 5 crore on the first day. Now taking advantage of Valentine's Day, the film has collected a total of Rs 12 crores.

నాలుగు రోజుల్లోనే లాభాలను రాబట్టేసిన డీజే టిల్లు

Posted: 02/16/2022 01:36 PM IST
Sidhu jonnalagadda s dj tillu 4 days box office collections

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ డీజే టిల్లు. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టిల్లు ప్రేక్షకులకు బాగా నచ్చేశాడు. తొలి రెండు రోజుల్లో ఏకంగా 7.50 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఏపీ తెలంగాణలో దాదాపు 1.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి 70 లక్షల వరకు వసూలు చేసింది ఈ సినిమా.

మొత్తంగా నాలుగు రోజుల్లో 10.54 కోట్ల షేర్ వసూలు చేయడంతో సినీబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ తరుణంలో సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన చిత్ర యూనిట్ త్వరలోనే సక్సెస్ మీట్ పెట్టనున్నారని సమాచారం. అయితే తొలి వీకెండ్ లో డీజే టిల్లు సినిమా బిజినెస్ 8 కోట్ల 50 లక్షలు జరిగితే.. బ్రేక్ ఈవెన్ పాయింట్ కు చేరుకుంటోందని నిర్మాణ వర్గలు చెప్పాయి. కాగా మూడు రోజుల్లోనే రూ 9.4 కోట్లను వసూళ్లు చేయడంతో పాటు నాలుగు రోజుల్లోనూ తన వసూళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదని ఏకంగా రూ. 10.54 కోట్లతో బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి లాభాలు కూడా తీసుకొచ్చింది.

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. 1-2 ఏరియాల్లో మినహాయిస్తే ఇప్పటికే అన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది డీజే టిల్లు. ఓవర్సీస్‌లో అయితే లాభాల సునామీ కనిపిస్తోంది. నైజాంలో కూడా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొస్తుంది ఈ సినిమా. ఈ వీకెండ్ కూడా పెద్దగా సినిమాలు లేవు. దాంతో ఖచ్చితంగా రెండో వారం కూడా డీజే సౌండ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కచ్చితంగా ఫుల్ రన్ లో 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసేలా కనిపిస్తోంది డీజే టిల్లు. ఇదే జరిగితే ఇటు నిర్మాతలకు.. అటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండినట్టే.

4వ రోజు డీజే టిల్లు సినిమా వసూళ్లు ఇలా

నైజాం : రూ 55 లక్షలు
సీడెడ్ : రూ 15 లక్షలు
UA: రూ 12 లక్షలు
తూర్పు : రూ 6 లక్షలు
వెస్ట్: రూ 5 లక్షలు
గుంటూరు: రూ. 6 లక్షలు
కృష్ణా : రూ 6 లక్షలు
నెల్లూరు: రూ. 4 లక్షలు
AP-TS మొత్తం : రూ. 1.09 కోట్లు ( రూ. 1.70 కోట్లు గ్రాస్)

ఇక నాలుగు రోజులుగా ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఇలా:-

నైజాం : రూ 4.28 కోట్లు
సీడెడ్ : రూ 1.14 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ 77 ఎల్
తూర్పు : రూ 47 ఎల్
వెస్ట్: రూ 56 ఎల్
గుంటూరు : రూ 43 ఎల్
కృష్ణా : రూ 36 ఎల్
నెల్లూరు : రూ 28 ఎల్
ఏపీ-తెలంగాణ మొత్తం : రూ. 8.29 కోట్లు (గ్రాస్ రూ. 14.70 కోట్లు)
కర్ణాటక+మిగిలిన భారతదేశం: రూ 0.65 కోట్లు
ఓవర్ సీస్: రూ 1.60 కోట్లు
DJ టిల్లు యొక్క టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్: రూ. 10.54 కోట్లు షేర్(రూ. 18.70 కోట్ల గ్రాస్)

రోజు వారీ కలెక్షన్స్
రోజు 1: రూ. 3.18 కోట్లు
2వ రోజు: రూ. 2.62 కోట్లు
3వ రోజు : రూ. 1.40 కోట్లు
4వ రోజు : రూ. 1.09 కోట్లు
మొత్తం AP/TS : రూ. 8.29 కోట్లు (గ్రాస్ రూ. 14.70 కోట్లు)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DJ Tillu  Siddhu Jonnalagadda  Neha shetty  Vimal Krishna  Sricharan Pakala  Tollywood  

Other Articles