Aashiqui Aa Gayi Song From Radhe Shyam Is Out ‘ఆషికీ ఆ గయి’ అంటూ రాధేశ్యామ్ రొమాంటిక్ సాంగ్ విడుద‌ల‌

Radhe shyam song aashiqui aa gayi prabhas pooja hegde look as perfect couple

radhe shyam, radhe shyam new song, radhe shyam movie, prabhas, prabhas new song, prabhas new movie, pooja hegde new, pooja hegde new songs, pooja hegde videos, pooja hegde new movie, pooja hegde dance, pooja hegde latest movie, prabhas latest, Bollywood, movies, Entertainment

The makers of the upcoming multilingual movie Radhe Shyam on Wednesday released the music video of the song titled “Aashiqui Aa Gayi”. The video begins with Prabhas stating his terms for the relationship with Pooja. It seems he is not looking for anything serious or epic. “I’m not the type that dies for love,” he says. “I just want to flirt.”

‘ఆషికీ ఆ గయి’ అంటూ రాధేశ్యామ్ రొమాంటిక్ సాంగ్ విడుద‌ల‌

Posted: 12/01/2021 07:51 PM IST
Radhe shyam song aashiqui aa gayi prabhas pooja hegde look as perfect couple

రెబల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా రాధేశ్యామ్ చిత్రం గురించి ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ సాగుతున్నాయి. ఇటీవ‌ల ‘ఆషికీ ఆగ‌యా..’ అంటూ సాగే హిందీ సాంగ్ ప్రోమో విడుద‌ల చేయ‌గా, ఇది ప్ర‌భాస్ ఫ్యాన్స్‌నే కాదు.. సినీ అభిమానులను కూడా అల‌రించింది. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ ఉన్న డ్రెస్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. ఇవాళ తాజాగా ఈ పాట ఫుల్ లెంగ్త్ సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాట‌లో విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్‌గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే మ‌ధ్య కెమిస్ట్రీ ప్రేమికుల‌ను మెస్మరైజ్ చేస్తుంద‌న‌డంలో సందేహం లేదనిపిస్తుంది. ఇందులో ఎదుటివారి చేతి రేఖ‌ల‌ను చూసి వారి భ‌విష్య‌త్తును చెప్ప‌గ‌ల నేర్ప‌రి అయిన హీరో.. త‌న ప్రేయ‌సి చేతి రేఖ‌ల‌ను చూసి ఆమె ప్ర‌మాదాల‌ను ప‌సిగ‌డ‌తాడు. ఆమెను ఆ ప్ర‌మాదాల బారి నుంచి ఎలా ర‌క్షించుకున్నాడ‌నేదే సినిమా అని తెలుస్తుంది. యువీ క్రియేష‌న్స్‌, టి సిరీస్ సంస్థ‌ల‌పై మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles