'83' teaser leaves cricket lovers nostalgic ‘83’ నుంచి థ్రిల్లింగ్ టీజర్.. కపిల్ దేవ్ గా రణ్ వీర్.!

83 teaser kabir khan gives a peek at the historic catch by kapil dev in the 1983 world cup final

83 movie, ranveer singh upcoming movie, 1983 world cup movie, kapil dev biopic, Ranveer Singh, Kapil Dev, Cinema, Ranveer Singh as Kapil Dev, Cricket, World Cup, 1983, ThisIs83, 83 First Look, Motion Poster, poster, Deepika Padukone, Pankaj Tripathi, Tahir Raj, Jiiva, Saqib Saleem, Jatin Sarna, Chirag Patil, Dinker Sharma, Nishant Dahiya, Harrdy Sandhu, Sahil Khattar, Ammy Virk, Addinath Kothare, Dhairya Karwa, R Badree, Movies, Films, Bollywood, movies, Entertainment

The teaser of Kabir Khan’s 83 is out after a long wait but a few seconds of an edge-of-the-seat match is all we get to see at the moment. The teaser shows the World Cup winning ball where Madan Lal bowled to Vivian Richards and Kapil Dev took the catch.

క్రికెట్ నేపథ్య ‘83’ నుంచి థ్రిల్లింగ్ టీజర్.. కపిల్ దేవ్ గా రణ్ వీర్.!

Posted: 11/26/2021 07:00 PM IST
83 teaser kabir khan gives a peek at the historic catch by kapil dev in the 1983 world cup final

రణ్ వీర్ సింగ్ హీరోగా '83' సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రపంచంలో అప్పటివరకు పసికూనగానే పరిగణించబడిన టీమిండియా.. తాను పసికూన కాదు.. కలయబడి తిరగబడితే తానే ప్రపంచ ఛాంపియన్ అని చాటిచెప్పి.. చరిత్రలో తనకంటూ సరికొత్త అధ్యయనాన్ని లిఖించుకున్న ఏడాది 1983. సరిగ్గా 1983 జూన్ 25న లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ లో ఫైనల్ వరకు వెళ్లిన కపిల్ సేన.. చివరి పోరాటంలో అప్పటికే దిగ్గజ బ్యాట్స్ మెన్లు వున్న వెస్టిండీస్ తో తలపడతోంది.

కట్ చేస్తే మదన్ లాల్ వేసిన బంతిని వివ్ రిచర్డ్స్ షాట్ కోట్టగా అది కాస్తా గాలిలోకి పైకి ఎగసింది. అయితే క్యాచ్ గా మైదనాంలో పడబోతోంది. దానిని అందుకునేందుకు ఇద్దరు ఇండియన్ పీల్డర్స్ పరుగు పరుగున వస్తారు. క్యాచ్ పట్టుకుంటారా.? లేక విడిచిపెడతారా.? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చివరికి ఏం జరిగింది. క్యాచ్ పట్టారా.? అన్నది మాత్రం తెలియకుండానే కట్ చేసి.. సినిమా టైటిల్ ని వేశారు. ఇది చిత్ర టీజర్. ఈ నెల 30న ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రికెట్ నేపథ్యంలో నడుస్తుంది.

టీమ్ ఇండియా తొలిసారిగా వరల్డ్ కప్ ను గెలుచుకున్న ఏడాది '83'. దీంతో ఈ చిత్రానికి ఈ టైటిల్ ను సెట్ చేశారు. జట్టు విజయంలో కపిల్ దేవ్ కీలకమైన పాత్రను పోషించారు. ఆ అంశాన్ని ప్రధానంగా చేసుకుని నడిచే కథ ఇది. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషించాడు. బడా బ్యానర్లు కొన్ని కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కపిల్ పాత్రను చేస్తున్న రణ్ వీర్, సహజత్వం కోసం గట్టిగానే కసరత్తు చేశాడు. తనలో కపిల్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. హిందీ సహా నాలుగు దక్షిణాది బాషల్లో డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 83  Teaser  Ranveer Singh  Kabir Khan  Madan Lal  Vivian Richards  Kapil Dev  Bollywood  

Other Articles