న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు ఇప్పటికే దానిని వీక్షించినా.. తమ స్టార్ రికార్డు గురించి గర్వంగా చెప్పుకునే పరిస్థితిలో లేరు. దీంతో నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ను మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తుండటం.. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేయడంతో అభిమానులు ఇప్పటికే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని తొలిసారిగా నటించిన చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కాగా, 'శ్యామ్ సింగ రాయ్' చిత్రబృందం అభిమానులకు మరో కానుక ఇచ్చి ఆరంభ సంబరాలకు అంకురార్పణ చేసింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ సందడి చేయనున్నారు. ఈ కథ కోల్ కతా నేపథ్యంలో నడుస్తుంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. కథా నేపథ్యంతో పాటు నాని .. సాయిపల్లవి .. కృతి శెట్టి పాత్రలను ఈ టీజర్ లో రివీల్ చేశారు. "అడిగే అండలేదు .. కలబడే కండలేదని రక్షించవలసిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే, కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే 'శ్యామ్ సింగ రాయ్' అంటూ ఆ పాత్ర మూలం చెప్పేశారు. ''స్త్రీ ఎవడికీ దాసీ కాదు ... ఆఖరికి ఆ దేవుడికి కూడా" అనే నాని డైలాగ్ తో, కథాంశం ఏమిటనేది అర్ధమయ్యేలా చేశారు. మొత్తం మీద ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more