Anubhavinchu Raja Trailer: Fresh and Hilarious! ‘అనుభవించు రాజా’ ట్రైలర్: రాజ్ తరుణ్ మార్కు వినోదం గ్యారంటీ..

Anubhavinchu raja trailer raj tarun starrer promises a fun ride

Raj Tarun, Anubhavinchu Raja, Anubhavinchu Raja Trailer, Kashish Khan, Srinu Gavireddy, Gopi sunder, Supriya Yarlagadda, Stand of Rahul, Tollywood, Moives, Entertainment

Raj Tharun is all set to try his luck at the box office with his Anubhavinchu Raja from November 26th. King Nagarjuna has released the film’s trailer a little while ago and it is completely hilarious.

‘అనుభవించు రాజా’ ట్రైలర్: రాజ్ తరుణ్ మార్కు వినోదం గ్యారంటీ..

Posted: 11/17/2021 09:58 PM IST
Anubhavinchu raja trailer raj tarun starrer promises a fun ride

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ త‌రుణ్ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యువకుడిగా, పందెం రాయుడిగా న‌టిస్తున్న తాజా ప్రాజెక్టు అనుభ‌వించు రాజా. విలేజ్ బ్యాక్ డ్రాప్ క‌థ నేప‌థ్యంలో చక్కని వినోదాత్మక చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు చిత్రాన్ని రూపోందిస్తున్న దర్శకుడు శ్రీను గ‌విరెడ్డి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చ్చింది. యంగ్ హీరో రాజ్ తరణ్ సరసన నటిక‌శిష్ ఖాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. తాజాగా అక్కినేని నాగార్జున ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘రూపాయి పాపాయి లాంటిది రా..దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ..ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు..‘అంటూ వ‌చ్చే సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది ట్రైల‌ర్‌. మొద‌ట్లో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా క‌నిపించి..ఆ త‌ర్వాత విలేజ్‌లో కోడి పందాల‌తో స‌ర‌దా లైఫ్‌ను ఎంజాయ్ చేసే వాడిగా క‌నిపిస్తున్నాడు. హీరోహీరోయిన్ల మ‌ధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా క‌నిపిస్తుంది. ‘ వ‌చ్చే సంవ‌త్స‌రం ఇదే రోజు..ఇక్క‌డే జెండా ఎగ‌రేస్తా..ప్రెసిడెంట్‌గా ‘ అంటూ చివ‌ర‌లో రాజ్‌త‌రుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

రాజ్ తరుణ్ చేతికి బంగార‌పు ఉంగ‌రాలు, బ్రాస్ లెట్ పెట్టుకుని స్టైలిష్ గాగుల్స్ తో పందెం రాయుడిగా అల‌రించ‌బోతున్న‌ట్టు ట్రైల‌ర్ చెప్పేస్తుంది. అంతేకాదండోయ్ ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ యువసామ్రాట్ అక్కినేని నాగార్జునకు అభిమానిగా నటించనున్నారు. సుప్రియా యార్ల‌గ‌డ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ మ్యూజిక్ డైరెక్టర్. భాస్క‌ర్ భ‌ట్ల పాట‌లు రాశారు. రాజ్ త‌రుణ్ దీంతోపాటు మ‌రోవైపు స్టాండ్ అప్ రాహుల్ సినిమాలో న‌టిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh