Teja Sajja, Shivani Rajasekhar's Adbhutham Trailer ఆసక్తిని పెంచుతున్న తేజ, శివానిల ‘అద్భుతం’ ట్రైలర్..

Adbhutham trailer teja shivani use the same phone number

Adbhutham, official trailer, Teja Sajja, Shivani Rajasekhar, Mallik Ram, Radhan, Mogulla Chandrashekhar Reddy, Tollywood, Movies, Entertainment

Adbhutham's official trailer is out today. It is a romantic thriller starring Teja Sajja and Shivani Rajasekhar in prominent parts. Satya, a stand-up comedian, plays the hero's companion. Mallik Ram directed the film, which was produced by Mogulla Chandrashekhar Reddy.

ఆసక్తిని పెంచుతున్న తేజ, శివానిల ‘అద్భుతం’ ట్రైలర్..

Posted: 11/09/2021 08:06 PM IST
Adbhutham trailer teja shivani use the same phone number

హీరో రాజశేఖర్, నటి జీవిత తనయ శివాని రాజశేఖర్ కథానాయికగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం  టు స్టేట్స్. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ లో జాప్యం ఏర్పడింది. దీంతో అమె నటిస్తున్న రెండవ చిత్రం ‘అద్భుతం’ నేరుగా ధియేటర్లలో విడుదలకు నోచుకోకుండా.. ఓటిటిలో విడుదల అవుతోంది. ఈ నెల 19న ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా, ఇది అద్బుతమైన రోమాంటిక్ లవ్ స్టోరీలా తెరకెక్కింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మాతగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాను మల్లిక్ రామ్ తన దర్శకత్వంలో రూపొందించారు. హీరో ఫోన్ నెంబర్ .. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఒకటే కావడం.. అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం .. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇందులో అద్భుతం ఏముంది? అనే సందేహం ట్రైలర్ పూర్తయ్యేలోగా చాలామందికి వస్తుంది. అందుకనే డైరెక్టర్ అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు.

హీరోకి హీరోయిన్ కనిపించదు .. బెంచ్ పై ఆమె రాస్తున్న అక్షరాలు మాత్రం కనిపిస్తుంటాయి. ఇదేదో సైన్స్ ఫిక్షన్ లా ఉందే అని మనం అనుకునేలోగానే, హీరోతోనే ఆ మాట అనిపించేశారు. స్క్రీన్ ప్లే - సంభాషణలు లక్ష్మీభూపాల్ అందించిన ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య ఎగబాటు సన్నివేశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక చిత్రంలో హస్యం పాలు కూడా కొంచెం అధికంగానే వున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh