Nagarjuna surprises with his singing in 'Bangarraju' అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ నుంచి లిరికల్ సాంగ్.!

Laddunda lyrical video from akkineni nagarjuna s bangarraju out

Bangarraju, Nagarjuna Akkineni, Naga Chaitanya, Laddunda Lyrical song, Ramya Krishna, Krithi Shetty, Kalyan Krishna Kurasala, Anup Rubens, Bhaskarabhatla Ravi Kumar, Tollywood, Movies, Entertainment

After delivering the blockbuster Soggade Chinni Nayana, Akkineni Nagarjuna and director Kalyan Krishna Kurasala have come together for its sequel Bangarraju. As the movie also stars Nagarjuna's son Akkineni Naga Chaitanya, the expectations are high. The makers of Bangarraju released the first song from the movie, which has now caught everyone's attention.

అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ నుంచి లిరికల్ సాంగ్.!

Posted: 11/09/2021 05:46 PM IST
Laddunda lyrical video from akkineni nagarjuna s bangarraju out

ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో నాగార్జున – దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపోందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘లడ్డుండా’ అనే లిరికల్‌ సాంగ్ ని అక్కినేని నాగార్జున మంగళవారం విడుదల చేశాడు.

ఇక ఈ పాట నెట్టింట్లో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్‌ అందించిన ఈ పాటని  ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్‌ మోహన్‌ అద్భుతంగా ఆలపించారు. 'బాబూ.. తబలా.. అబ్బాయ్ ఆర్మనీ.. చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా' అంటూ పాట‌కు ముందు వ‌చ్చే సాకీకి నాగార్జున గ‌ళం తోడు కావ‌డంతో పాట అదిరిపోయింది. అంతేకాదు యువసామ్రాట్ అభిమానులు దానిని షేర్ చేసుకోవడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అచ్చంగా గాయకుడి తరహాలోనే అక్కినేని నాగార్జున సాకీని అద్భుతంగా ఆలపించడం అభిమానులను మరింత ఉత్సాహంలోకి నెట్టింది. అభిమానుల జోష్ కు మరింత డోస్ అదనంగా కలిపేలా చేసింది నాగ చైతన్య ట్వీట్. ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌ని తన ట్విటర్‌ ఖాతలో పోస్ట్‌ చేసిన ఆయన.. ‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్‌ చేయలేరు’ కామెంట్‌ చేశాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles