Manchu Vishnu Takes Charge as New MAA President ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు

Maa elections manchu vishnu takes charge as new president

Manchu Vishnu, Movie Artists Association, New President, Manchu Vishnu takes Charge, Manchu Vishnu MAA new prez, Prakash Raj, Prakash raj MAA membership, Prakash Raj loses in MAA Elections, maa elections 2021, maa elections, maa elections 2021 date, maa president telugu election, maa association president election, jeevitha, prakash raj, manchu vishnu, hema actress, maa news, maa president, maa association president, prakash raj news, tollywood, movies, entertainment

Manchu Vishnu tasted a victory against Prakash Raj in the Movie Artists Association (MAA) elections as the President. Amidst high drama, negativity, criticism, and allegations, Manchu Vishnu’s panel won a majority. Today, the actor has assumed the office of president of the MAA.

‘మా’ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

Posted: 10/13/2021 01:35 PM IST
Maa elections manchu vishnu takes charge as new president

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగి.. సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ప్రత్యర్థివర్గాలకు చెందిన అభ్యర్థుల అరోపణలు, ప్రత్యారోపణలు కూడా మిన్నంటి ఆద్యంతం తెలుగు ప్రేక్షకులను కూడా ఉత్కంఠకు గురిచేశాయి. ఈ క్రమంలో ఓడిమి చవిచూసిన ప్రకాష్ రాజ్.. ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది వారి పదవులకు రాజీనామా కూడా చేసి.. మంచు విష్ణు ప్యానెల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహపడింది. దీంతో క్రితం రోజుతో అన్నింటికీ పుల్ స్టాప్ పడింది.

కాగా మా అసోసియేషన్ నూతన అథ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. అత్యంత ఆదరణ కలిగిన సినీకళామతల్లికి చెందిన బిడ్డల ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించడంతో ప్రజలు కూడా ప్యానెల్ వారిగీ విడిపోయి తమ స్టార్లకు మద్దుతు పలికేలా పరిస్థితి మారింది. ఇక గత ఆదివారం జ‌రిగిన ఈ ఎన్నిక‌ల‌లో మంచు విష్ణు ప్ర‌కాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన వారిని కొనసాగిస్తారా..? లేక వారి అభీష్టం మేరకే రాజీనామాలను అమోదిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే. ఇక వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేసే అంశంపై కూడా మంచు విష్ణు ఆయన ప్యానెల్ సభ్యులు ఎలా స్పందిస్తారన్న అంశం కూడా ఉత్కంఠను రేపుతోంది. వారి భర్తీ చేయకుండా  వేరే నిర్ణ‌యం తీసుకుంటారా అనే దానిపై అంద‌రిలో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా విష్ణు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడా అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles