Prabhas' 25th film is titled Spirit 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా

Prabhas 25th film announced in sandeep reddy direction prabhas25 news

Prabhas, Prabhas25, Sandeep Vanga, T Series, Adipurush, Salaar, Radhe Shyam, Project K, Prabhas25 news, Prabhas25 updates, Prabhas25 latest, Prabhas25 breaking news, Prabhas25 breaking updates, Prabhas25 announcement, Prabhas25 announcement date, Prabhas25 latest updates, Prabhas25 cast, Prabhas25 director, Prabhas25 producer

Prabhas' 25th film is titled Spirit: Young Rebelstar Prabhas is busy with a number of pan-Indian films. The actor is rushed with several offers from all the corners of the country and the top actor preferred to work with directors who can direct pan-Indian films. His 25th film is announced today and it will be directed by Sandeep Reddy.

'అర్జున్ రెడ్డి' దర్శకుడితో ప్రభాస్ 25వ సినిమా ఖరారు

Posted: 10/07/2021 06:43 PM IST
Prabhas 25th film announced in sandeep reddy direction prabhas25 news

'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా యువతలో తన మార్కును క్రియేట్ చేసుకోగా.. ఇదే చిత్రంతో ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా తెలుగు ప్రేక్షకులలో చక్కని గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ చేరిపోతే, స్టార్ డైరెక్టర్ల జాబితాలో సందీప్ రెడ్డి చేరిపోయాడు. ఆ తరువాత ఎంతోమంది టాలీవుడ్ హీరోలు ఆయనతో కలిసి పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. కానీ ఆయన మాత్రం 'అర్జున్ రెడ్డి' కథను బాలీవుడ్ కి తీసుకెళ్లి అక్కడ కూడా హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన ప్రభాస్ తో చేయనున్నాడనేది కొంత సేపటి క్రితం వదిలిన పోస్టర్ ద్వారా స్పష్టమైపోయింది.

'స్పిరిట్' టైటిల్ తో రూపొందనున్న ఈ పాన్ ఇండియా సినిమాకి, భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. కెరియర్ పరంగా ప్రభాస్ కి ఇది 25వ సినిమా. ప్రభాస్ తన 25వ సినిమాను రాజమౌళితో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వచ్చారు. లేదంటే సందీప్ రెడ్డి వంగాతో గానీ .. సిద్ధార్ ఆనంద్ తో గాని చేయవచ్చని చెప్పుకున్నారు. చివరికి సందీప్ రెడ్డి వంగాతో సెట్ అయిందన్న మాట. 'సలార్' .. 'ఆది పురుష్'తో పాటు, నాగ్ అశ్విన్ సినిమా కూడా పూర్తయిన తరువాత, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

ప్రభాస్ తన 25వ సినిమాను సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే చేయనున్నాడనే అధికారిక ప్రకటన వచ్చింది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను గురించి ప్రభాస్ మాట్లాడుతూ .. "25వ సినిమాగా 'స్పిరిట్' చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన కథాంశం. ఈ సినిమాలోలా నన్ను చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం పనిచేయడానికి ఎక్కువ కాలం వెయిట్ చేయలేను" అంటూ తన ఆసక్తిని .. ఆత్రుతను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, ఈ కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Prabhas25  Sandeep Vanga  T Series  

Other Articles

Today on Telugu Wishesh