Veteran film publicity designer Eswar passes away ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత

Veteran film publicity designer eswar passes away

eswar, eeswar, eshwar, kosana Eswara Rao, film publicity designer eswar dead, kosana eeswara rao death, eeswar passed away, film publicity designer eswar no more, film poster designer eswar, eeswara Rao dies, film publicity designer, film poster designer, publicity designer eswar, eswar movies, South Indian movies, Tollywood

Veteran film publicity and poster designer Eswar aka Kosana Eswara Rao passed away in the wee hours Today at his residence in Chennai. He was 84. Hailing from Palakollu of West Godavari in Andhra Pradesh, Eswar began his career assisting artist Ketha. Later, he established his publicity designing company Eswar in Chennai.

ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత

Posted: 09/21/2021 11:59 AM IST
Veteran film publicity designer eswar passes away

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్ స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. బొమ్మలు గీయడంలోనే కెరియర్‌ను వెతుక్కోవాలని భావించిన ఈశ్వర్ కాకినాడలో చదువుతున్న పాలిటెక్నిక్ చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టేసి మద్రాస్‌కు చేరుకున్నారు. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌లో మెళకువలు నేర్చుకున్నారు. కొన్నాళ్ల పాటు ఆక్కడే డిజైనింగ్ చేశారు.

ఆ తర్వాత ఈశ్వర్ తన పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీ ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన ‘సాక్షి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ పనులు ప్రారంభించారు. ఆ సినిమా కోసం కలర్ పోస్టర్లు, లోగో తయారు చేశారు. ‘పాప కోసం’ సినిమాకు బ్రష్ తో కాకుండా, నైఫ్ వర్క్‌తో పోస్టర్లు రూపొందించి గుర్తింపు పొందారు. హిందీ, తమిళ వెర్షన్లకూ అలాంటి పోస్టర్లే రూపొందించారు. తన డిజైనింగ్ వర్కులోనూ విభిన్నమైన నైపుణ్యంతో రాణించిన ఈశ్వర్ ఇవాళ ఉదయం పరమపదించారు. కాగా ఆయన మృతిపట్లు అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles