Megastar Chiranjeevi is an asset to Tollywood: Prakash Raj టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి ఒక వరం: ప్రకాశ్ రాజ్

Prakash raj meets chiranjeevi in gym says megastar is an asset to tollywood

chiranjeevi, prakash raj, megastar, asset, Gym, Telugu film industry, BOSS, Nagababu, CM Jagan, MAA Elections, Twitter, Tollywood, Movies, Entertainment

Actor Prakash Raj met Chiranjeevi at a gymnasium in Hyderabad on Tuesday morning. He showered praises on him for taking lead to find solutions for issues faced by the Telugu film industry.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి ఒక వరం: ప్రకాశ్ రాజ్

Posted: 08/17/2021 01:01 PM IST
Prakash raj meets chiranjeevi in gym says megastar is an asset to tollywood

మెగాస్టార్ చిరంజీవిపై విలక్షణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీపరిశ్రమకు చిరంజీవి ఒక వరమని కొనియాడారు. తెలుగు చిత్రపరిశ్రమలో నెలకొన్న సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించే చోరవ చేపట్టిన చిరంజీవిని కలిగివుండడం తమ అదృష్టంగా చెప్పుకోచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పేర్కోన్నారు. ఈ సంద‌ర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ భుజానికి గాయం కావడంతో సన్ షైన్ అసుపత్రిలో శస్త్రచికిత్స చేసుకుని.. ఆదివారం రోజునే డిశ్చార్జ్ అయ్యారు.

డిశ్చార్జీ అయిన తరువాతి రోజునే ఆయన నేరుగా మెగాస్టార్ చిరంజీవిని జిమ్ లో కలుసుకున్నారు. చిరంజీవి జిమ్ చేస్తుండగా వెళ్లిన ప్రకాశ్ రాజ్ ఆయనతో పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే తెలుగు పరిశ్రమకు చెందిన సినీనటుల అసోసియేషన్ మూవీ అర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీలో వున్న ప్రకాశ్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో.. ఆయన మద్దతును కూడా పోందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదివరకే చిరంజీవి మా ఎన్నికల నిర్వహణపై క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా వున్న రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే.

'ఉద‌యాన్నే బాస్ తో జిమ్ లో స‌మావేశ‌మ‌య్యాను. సినీ ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కోసం ఆయ‌న చూపుతోన్న చొర‌వ‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పాను. అన్న‌య్య మాకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నారు. ఓ వ‌రంలా సినీ ప‌రిశ్ర‌మ‌లో మాకు ఇటువంటి వ్య‌క్తి ఉన్నారు' అని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొన్నారు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రకాశ్ రాజ్ కు నాగబాబు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. త‌మ‌కు చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయ‌ని నాగ‌బాబు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  prakash raj  megastar  asset  Gym  Telugu film industry  BOSS  Nagababu  CM Jagan  MAA Elections  Tollywood  

Other Articles