‘Pushpa’ HIndi Rights at jaw drop Price అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ రైట్స్ కు భారీ ధర.!

Jaw dropping price for allu arjun pushpa hindi rights

Pushpa, Allu Arjun, Rashmika Mandanna, Pushpa raj, Mythri Movie Makers, Sukumar, Arya, Pushpa Hindi Dubbing Righs, pushpa part 1 Hindi dubbing rights, pushpa, telugu cinema, sandalwood smuggling, telugu films, Tollywood, Movies, Entertainment

Mythri Movie Makers who are bankrolling Allu Arjun starrer action drama Pushpa have decided to release in this Dussera Holidays. According to the latest update, this film hindi dubbing rights had been sold for a jaw dropping price.

అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ రైట్స్ కు భారీ ధర.!

Posted: 06/25/2021 08:45 PM IST
Jaw dropping price for allu arjun pushpa hindi rights

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్-ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపోందిన చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు మంచి క్రేజు. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ అంటే మిగతా బాషల్లోని అభిమానులకు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి కాంబినేషన్ రూపోందుతున్న అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి సంబంధించిన షూటింగు చివరిదశలో ఉంది.

ఈ చిత్రాన్ని వచ్చే నెలలో షూటింగు పార్టును పూర్తిచేసిన తరువాత పోస్టు ప్రోడక్షన్స్ పనులు, రీ-రికార్డింగ్ పనులు పూర్తి చేసుకన్న తరువాత ఫాన్ ఇండియా చిత్రంగా పలు బాషల్లో విడుదల అవుతున్న చిత్రాన్ని దసరా బరిలో నిలబెట్టాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా వార్తలు వస్తున్నాయి. 17.5 కోట్లకు ఈ సినిమా హిందీ అనువాద హక్కులను అమ్మేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఇది కేవలం 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించిన అనువాద హక్కుల నిమిత్తం మాత్రమే. 'పుష్ప' రెండవ భాగం హక్కులకి సంబంధించిన ఆలోచన ఆ సినిమా పూర్తయిన తరువాతనే చేస్తారు. వచ్చే ఏడాదిలోనే రెండవ భాగం షూటింగు మొదలవుతుంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించిన బోట్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. తెలుగు తెరపై ఇంతవరకూ చూడని కొత్త పద్ధతిలో ఈ ఫైట్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles