యువ దర్శకులలో తన రూటును సపరేటుగా మార్చుకుని వైవిధ్యభరిత చిత్రాలను రూపోందిస్తునన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన ప్రతీ చిత్రంపై తనదైన ముద్రను భిన్నంగా చూపించడానికి ఇష్టపడి తపన పడే దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగానే ఆయన వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. 'అ' .. 'కల్కి' .. 'జాంబి రెడ్డి' సినిమాలను పరిశీలిస్తే, ఒక జోనర్ కు మరో జోనర్ సంబంధం లేని కథలను ఆయన ఎంచుకుంటూ ముందుకు వెళ్లడం కనిపిస్తుంది. ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతూ మరో కొత్త జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఆయన తాజా ఎనౌన్స్ మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ రోజున ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా తన నుంచి కొత్త అప్డేట్ ఉంటుందని ఆయన నిన్ననే చెప్పాడు. అందులోనూ ఒరిజినల్ సూపర్ హీరోకు సంబంధించిన కథనే తాను తెలుగులో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రశాంత్ వర్మకు నచ్చిన ఒరిజినల్ సూపర్ హీరో ఎవరబ్బా అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక చెప్పినట్టుగానే కొంత సేపటిక్రితం ఆయన ఒక వీడియో వదిలాడు. తన తాజా చిత్రం 'హనుమాన్' అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు.
దీంతో గత కొన్ని గంటలుగా అయన ఇచ్చిన సస్పెన్స్ కు తెరవీడింది. అయితే కథ .. కాన్సెప్ట్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. టైటిల్ ను బట్టి చూస్తుంటే హనుమంతుడి అంశతో జన్మించినవారో .. అనుగ్రహం పొందినవారో చేసే విన్యాసాలకు సంబంధించినదిగా అనిపిస్తోంది. బహుశా ఇది పిల్లలను ఆకట్టుకునే కేటగిరీలోకి వస్తుందేమో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more