Balakrishna's Sri Rama Dandakam is out శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించిన బాలయ్య

Hero balakrishna sings sri rama dandakam on ntr s 98th birth anniversary

akhanda, boyapati srinu, nandamuri balakrishna, pragya jaiswal, sri rama dandakam, NBK official Youtube, Vinod Yajamanya, Tollywood

On the eve of Legend NTR’s 98th birth anniversary, Nandamuri Balakrishna paid a. tribute to his father by chanting ‘Sri Rama Dandakam’. The Dandakam was released on NBK official Youtube channel With music provided by Vinod Yajamanya and Balakrishna reciting effortlessly in his own style.

శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించిన బాలకృష్ణ

Posted: 05/28/2021 02:49 PM IST
Hero balakrishna sings sri rama dandakam on ntr s 98th birth anniversary

త‌న తండ్రి నందమూరి తారక రామారావు 98వ జన్మదినాన్ని పురస్కరించుకుని తన తండ్రి నిత్యం అరాధించే శ్రీరాముడి దండకాన్ని స్వయంగా ఆలపించారు సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ. తన తండ్రినే దైవంగా భావించి ఆయన శ్రీరాముడిగా న‌టించిన ప‌లు సినిమాల్లోని వీడియోలు, ఫోటోలతో రూపొందించిన ఓ వీడియోను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా తన అధికార యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశారు. దానికి స్వ‌యంగా శ్రీరామ దండకాన్ని ఆలపించి జ‌త‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వెండితెర మీద ఉన్న కథానాయకుడిని ఆబాలగోపాలానికి ఆరాధ్యుడ్ని చేసిన ఆది అధినాయకుడు ఎన్టీఆర్ అని ఈ సంద‌ర్భంగా బాల‌య్య కొనియాడారు.

ఇప్పటికీ పలు ఇళ్లలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీ వెంకటేశ్వరుడిగా, శ్రీ మహావిష్ణువుగా ఆయన చిత్రపటాలనే తెలుగు ప్రజలు కొలుస్తారు. అంతలా ఆయన తన పాత్రలను పోషించేవారు. తన పేరులోనే ఉన్న తారస్థాయిని తన జీవిత సహచరిగా నడిపించిన తారక రాముడు అని చెప్పారు. తెలుగు గడప రంగు జెండాని ప్రతిగుండెలో ఎగురవేసిన కోదండ రాముడని చెప్పారు. పేదవారి వెన్నపూస, తెలుగువారి వెన్నుపూస త‌న తండ్రి అని చెప్పారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు అంకితం ఇస్తూ ఈ శ్రీరామ దండకాన్ని ఆల‌పిస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles