Chiranjeevi sets up oxygen banks in Telugu states ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi launches oxygen banks in andhra pradesh to help covid patients

Megastar Chiranjeevi, Chiranjeevi Charitable Trust, chiranjeevi oxygen banks, chiranjeevi blood bank, chiranjeevi eye bank, chiranjeevi charity, Chiranjeevi, Chiranjeevi oxygen bank, Megastar Chiranjeevi, oxygen cylinders, oxygen concentrators, coronavirus, covid-19

Megastar Chiranjeevi recently launched oxygen banks in Andhra Pradesh in an attempt to help Covid-19 patients. The oxygen banks will be available to the public in nearly seven districts tomorrow, May 27.

ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి

Posted: 05/26/2021 11:14 AM IST
Chiranjeevi launches oxygen banks in andhra pradesh to help covid patients

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న క్రమంలో దేశంలో ఆక్సిజన్ అందక అనేక ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. దీంతో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్న క్రమంలో సినీ నటులు సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. సమాజం పట్ల, ప్రజల పట్ల అభిమానంతో సమాజసేవలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది కరోనా నేపథ్యంలో కోవిడ్ క్రైసెస్ చారిటీ ఏర్పాటు చేసి సినీ కార్మికులను అదుకున్నారు. అయితే ఈ సారి ప్రాణవాయువు కొరత ప్రాణాలను కబళించివేస్తుందన్న విషయం తెలుసుకుని తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు తనవంతు ప్రయత్నం మొదలుపెట్టారు.

దశాబ్దాలుగా తన పేరునున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్ర, రక్తదానంలో విస్తృత సేవలు అందిస్తున్న చిరంజీవి తాజాగా తన తనయుడు రామ్ చరణ్ తో కలసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు చేశారు. జిల్లా అభిమాన సంఘాల అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు కాగా, క్రితం రోజున కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు పంపిణీ జ‌రిగింది. ఇవాళ మరికొన్ని జిల్లాల‌కు ఆక్సిజ‌న్ కాన్సెంట్లేటర్లు పంఫిణీ చేసిన ఆయన ఇవాళ అధికారికంగా ఆక్సిజన్ సెంటర్లను ప్రారంభించారు.

ఏపీ, తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో ఆస్ప‌త్రి నుంచి ఆక్సిజ‌న్ కావాల‌ని కోర‌గానే సిలిండ‌ర్ల‌ను పంపిస్తారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి ఈ పంపిణీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉండనుండగా.. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభం సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ పంపిణీ కొనసాగుతుంది.

ఇక్క‌డ కొరతను తీర్చేందుకు చైనా నుంచి ఆక్సిజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్లు ఆర్డ‌ర్ చేశాం. ప్ర‌స్తుతం చాలా చోట్ల వీటి కొరత నెల‌కొంది. అత్యవసరంగా ఎక్క‌డ అవ‌స‌రం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజ‌న్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాల‌కు అవ‌స‌రం ఉన్న అన్నిచోట్ల‌కు పంపిణీ చేస్తాం. అలాగే ప్ర‌తిచోటా ఆక్సిజ‌న్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ ప‌రిక‌రాన్ని కూడా టెక్నీషియ‌న్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది స‌ద్వినియోగం కావాల‌నే మా ప్ర‌య‌త్నం. రామ్ చ‌ర‌ణ్ దగ్గరుండి ఈ ఏర్పాట్ల‌న్నీ చూస్తున్నారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles