Focus to shift on Mahesh Babu's announcements ‘సర్కారువారి పాట‘ ఫస్ట్ లుక్ తో రెడీగా వున్న సూపర్ స్టార్..

Mahesh babu to unveil first look poster of sarkaru vaari paata on superstar krishna s birthday

mahesh babu firstlook from sarkaru vaari paata, superstar mahesh babu, superstar Krishna 78 birthday, superstar mahesh babu new film announcement, mahesh babu, krishna, birthday, sarkaru vaari paata, first look, announcement, parasuram, S Thaman, Tollywood

The first look of Mahesh Babu’s upcoming film 'Sarkaru Vaari Paata' is likely to be out on his father superstar Krishna’s birthday on May 31, 2021. On May 31, 2020, Mahesh Babu surprised movie buffs by announcing that his 27th film will be helmed by young filmmaker Parasuram. He also announced that S Thaman will compose music for it.

‘సర్కారువారి పాట‘ ఫస్ట్ లుక్ తో రెడీగా వున్న సూపర్ స్టార్..

Posted: 05/21/2021 01:28 PM IST
Mahesh babu to unveil first look poster of sarkaru vaari paata on superstar krishna s birthday

సూపర్ స్టార్ మహేశ్ బాబు వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. కొత్త పాత అన్న దర్శకులతో కలసి ఆయన రూపోందిస్తున్న చిత్రాలు అన్ని బాక్సీఫిసు వద్ద బంపర్ హిట్లు కోడుతున్నాయి. అనీల్ రావిపూడి కాంబినేషన్లో సరిలేరు నీకెవ్వరూతో రికార్డు హిట్ ను సోంతం చేసుకన్న ఆయన తాజాగా పరశురామ్ దర్శకత్వంలో చిత్రాన్ని రూపోందిస్తున్నారు. ’గీత గోవిందం‘ చిత్రంతో తొలి చిత్రంలోనూ సూపర్ హిట్ కోట్టిన పరుశరామ్ తో కలసి మహేశ్ బాబు రూపోందిస్తున్న చిత్రం 'సర్కారువారి పాట'. ఈ చిత్రం గురించిన అప్ డేట్స్ అప్పుడప్పుడూ అభిమానులకు చేరుతున్నాయి.

బ్యాంక్ కి సంబంధించిన ఒక భారీ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఆ అంశం సీరియస్ గా సాగినా, కావలసినంత కామెడీ ఉంటుందని దర్శకుడు పరశురామ్ ముందుగానే చెప్పాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. కామెడీతో కలగలపిన సీరియస్ కథతో సరిలేరు నీకెవ్వరూ హిట్ కోట్టిన విధంగానే ఈ చిత్రం కూడా హిట్ సాధిస్తందని సూపర్ స్టార్ అభిమానులు ధీమాతో వున్నారు. ఇక వరుస విజాయాల పరంపరలో మరో చిత్రం చేరుతుందని కూడా వారు ధీమాగా ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గితే ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను కొనసాగించనుంది.

ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఫస్టులుక్ పోస్టర్ ను డిజైన్ చేయించే పనిలో పరశురామ్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ డిఫరెంట్ గా ఉండనుంది. అందువలన ఆయన అభిమానులు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఈ పోస్టర్ తో మరింతగా అంచనాలు పెరగడం ఖాయమనే నమ్మకంతో వాళ్లు ఉన్నారు. దుబాయ్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 'సంక్రాంతి'కి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  krishna  birthday  sarkaru vaari paata  first look  announcement  parasuram  S Thaman  Tollywood  

Other Articles