టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విభిన్నంగా కనిపించనున్నారు. మొదటి నుంచి తన చిత్రంలోని క్యారెక్టర్ కు తగ్గట్టుగా మేకర్ చేసుకోవడం బన్నీకి అలవాటే. దీంతో చిత్రాలు కూడా హిట్ కావడం కామన్. అల వైకుంఠపురం అందించిన రికార్డు హిట్ అందుకున్న బన్నీ.. ఇక అంతకుమించిన హిట్ కోసం సుమార్ తో చేయి కలిపారు.
‘పుష్ప’ చిత్రంలో గిరిజన యువతిగా రష్మిక మందన అలరిస్తుందన్న టాక్ కూడా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 6.12 నిమిషాలకు ‘పుష్ప’ చిత్రంలోని పుష్పరాజ్ ను పరిచయం చేయించేందుకు సినీయూనిట్ ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఒక ప్రీలూడ్ తరహాలో 18 సెకన్ల నిడివితో ఓ వీడియోను అందించారు. ఈ వీడయోలో వెనక్కి విరిచి తాళ్లతో కట్టేయబడిన చేతులతో 'పుష్పరాజ్' పారిపోతండగా, అడవిలో తన అడుగు తీసిన వెంట్రుక వాసిలో అదే స్థలంలో తుపాకి గుండు పేలుతుంది.
వెనక్కి తిరిగి చూసిన పుష్ప.. ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. కాగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. బన్ని పుట్టిన రోజు ఏప్రిల్ 8ని పురస్కరించుకుని ఏప్రిల్ 7 అనగా ఒక్క రోజు ముందుగానే ఈ ఫస్ట్ లుక్ వీడియోను వదలనున్నారు. కాగా ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇదివరకే చిత్రబృందం తెలిపింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more
Mar 31 | ట్రైలర్ ఓపెన్ చేస్తే.. ‘‘నీకు తెలిసిన ఓ మంచి రైటర్ ఎవరైనా వుంటే చెప్పు’’ అంటూ ఓ లేడీ ఓ వ్యక్తికి చెబుతోంది. దాంతో అతను సార్ స్పీడుకు తగ్గ రైటర్ ను తీసుకువచ్చి... Read more