SS Rajamouli Releases Ajay Devgn's Firsti look అజయ్ దేవగన్ పుట్టినరోజున.. ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ లుక్..

Ss rajamouli releases ajay devgn s firsti look from period epic rrr

RRR, Ajay Devgn's Firsti look, Ajay Devgn, Firsti look, SS Rajamouli, Jr NTR, Ram Charan, RRR October 13 2021, RRR, ajay devgn, RRR shooting, ajay devgn in RRR, ajay devgn pics, Ram charan, NTR, Tarak, Rajamouli, Tollywood, movies, entertainment

The motion poster of the upcoming period action film RRR starring Ajay Devgn's Firsti look is out. The movie is directed by SS Rajamouli and produced by DVV Danayya under the banner of DVV Entertainments. Ram Charan and Jr NTR are playing lead roles in the flick.

అజయ్ దేవగన్ పుట్టినరోజున.. ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ లుక్..

Posted: 04/02/2021 06:25 PM IST
Ss rajamouli releases ajay devgn s firsti look from period epic rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ టీమ్ ఆయనకు అందమైన కానుకను అందించింది. ఈ కానుకతో అజయ్ దేవ్ గణ్ అభినానులతో పాటు అటు తారక్, ఇటు చరణ్ తో పాటు జక్కన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా వున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అజయ్ దేవగన్ పాత్ర ఔచిత్త్యాన్ని ఈ కానుక బహిర్గతం చేసింది.

ఏప్రిల్ 2న అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సినీప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో మల్లీస్టారర్ గా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్న విషయం అభిమానులకు విధితమే.

ఈ చిత్రంలో ఇంకా శ్రియ, సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవెన్‌సన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా షెడ్యూల్ ప్రకారం గతేడాది జులై 30న విడుదల కావాల్సివున్నా కరోనా కష్టకాలం నేపథ్యంలో చిత్ర విడుదల వాయిదాలు పడుతూ చివరకు విజయదశమి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 13న చిత్రాన్ని దసరా కానుకగా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles