Nikhil injures himself on sets of 'Karthikeya 2' ‘కార్తికేయ’ షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్‌కి గాయాలు

Nikhil siddhartha gets injured on the sets of karthikeya 2

Nikhil, Nikhil Siddhartha, minor injury, Kumbh Mela, Karthikeya 2, Gujarat, Chandoo Mondeti, action sequence, Tollywood, Movies, Entertainment, Entertainment News, Telugu Movies News, Tollywood News

Tollywood actor Nikhil Siddhartha has suffered a minor injury while shooting for his upcoming film, Karthikeya 2. The actor is said to have suffered a leg injury while doing an action sequence filming in Gujarat.

‘కార్తికేయ’ షూటింగ్‌లో ప్రమాదం.. హీరో నిఖిల్‌కి గాయాలు

Posted: 03/10/2021 08:16 PM IST
Nikhil siddhartha gets injured on the sets of karthikeya 2

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. అలియాస్ నిఖిల్ సిద్ధార్థ్ షూటింగ్ లో గాయలయ్యాయన్న వార్త ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. షూటింగ్ సన్నివేశాలలో అనుకోని అపశృతి చోటుచేసుకోవడంతో నిఖిల్ గాయాలపాలయ్యడాని తెలుస్తోంది. విలక్షణ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం 'కార్తికేయ 2'. ఈ చిత్రం ప్రస్తుతం గుజరాత్ లో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే చిత్రంలో కీలక సన్నివేశమైన ఓ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరణ జరుపుతుండగా.. ప్రమాదం సంభవించినట్టు సమాచారం.

దీంతో వెంటనే సినిమా షూటింగ్ ను చిత్ర బృందం నిలిపివేసిందని, కాగా, నిఖిల్ ప్రమాదం తరువాత కూడా చాలాసేపు నొప్పితో బాధపడ్డారని సోషల్ మీడియాలో చక్కర్ుల కోడుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హీరో నిఖిల్‌కి స్వల్ప గాయాలు అవడంతో.. వెంటనే షూటింగ్‌ ఆపేశారని, మరికొన్ని రోజుల పాటు ఈ సన్నివేశాలు చిత్రీకరణ నిలిపివేశారని సమాచారం. ఇదిలావుండగా  హీరో నిఖిల్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులెవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్రబృందం తెలిపింది.

నిఖిల్ కు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని.. ప్రస్తుతం ఆయన చక్కగానే ఉన్నారని చిత్రయూనిట్‌ వర్గాలు తెలుపుతున్నాయి. నిఖిల్‌, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రం ఎటువంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా రీసెంట్‌గా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles