Uppena 15 Day Collections crosses Rs 26 cr ఉప్పెన కలెక్షన్ల సునామీ: తొలి పక్షంలో రికార్డు స్థాయి వసూళ్లు

Uppena 15 day collections record breaking start uppena news

Uppena, Vaisshnav Tej, Buchi Babu, Mythri Movie Makers, Devi Sri Prasad, Krithi Shetty, Uppena news, Uppena trailer, Uppena release, Uppena collections, Uppena review, Uppena report, Uppena movie updates, Uppena theatrical shares, Uppena theatrical run, tollywood, Moives, Entertainment

Uppena Day 15 day Collections: Record breaking start: Supreme Star Sai Dharam Tej's brother Vaisshnav Tej made his debut with Uppena, a small film that is a romantic entertainer. The makers wanted to complete the film on a budget of Rs 8 crores but spent Rs 22 crores, after the release the movie minted money collecting of about Rs 100 crore.

ఉప్పెన కలెక్షన్ల సునామీ: తొలి పక్షం వసూళ్లు

Posted: 02/27/2021 04:21 PM IST
Uppena 15 day collections record breaking start uppena news

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22 కోట్ల బడ్జెట్ ను తీసుకోవడంతో.. అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి తోడు కరోనా మహమ్మారితో సినిమా విడుదలలో కూడా తీవ్ర జాప్యం చేసుకుంది. ఈ తరుణంలో విడుదలైన చిత్రం బాక్సీఫీసు వద్ద ఎలా సవ్వడి చేస్తోందా.? అన్న ప్రశ్నలకు అన్ లాక్ తరువాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా ఉప్పెన రికార్డును నమోదు చేసుకుంది.

ఇక దీంతో పాటు హీరో తెరంగ్రేటం చేయడంతోనే సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డు కూడా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు నుంచి వైష్ణవ్ తేజ్ పేరున లిఖించేలా చేసింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్ల‌స్ పాయింట్ అయింది. ఇక ఈ చిత్రం తొలి పక్షం రోజుల వ్యవధిలో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల చేరువలో గ్రాస్ రాబట్టింది.

ఇక గత 15 రోజులుగా మొత్తంగా
నిజాం:      రూ .14.15 కోట్లు
సీడెడ్:      రూ .7  కోట్లు
వైజాగ్:     రూ 8 కోట్లు
గుంటూరు: రూ. 2.75 కోట్లు
తూర్పు:   రూ. 4.6 కోట్లు
పశ్చిమ:   రూ. 2.45 కోట్లు
కృష్ణ:       రూ. 2.9 కోట్లు
నెల్లూరు:   రూ. 1.6 కోట్లు
ఏపీ, తెలంగాణ: రూ .43.45 కోట్లు షేర్ తో పాటు
ప్రపంచవ్యాప్తంగా 46.95 షేర్ సాధించింది.

ఇక ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి.. ఉప్పెన చిత్ర యూనిట్ తో కలసి ఇవాళ తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకుంది. ఉప్పెన టీంతో పాటు హీరోహీరోయిన్లు కూడా కాలినడకన తిరుమల శ్రీవారి కొండను ఎక్కి.. స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వారు కొండెక్కుతుండ‌గా అదే మార్గంలోని భక్తులు తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles