Star actress to play Prabhas' leading lady in Salaar సలార్ లో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్..

Prabhas welcomes star actress in lead role in salaar pens a sweet birthday

Shruti Haasan, prabhas, salaar, salaar movie, Shruti Haasan birthday, Shruti Haasan news, salaar actors, salaar cast, Prashanth Neel, Tollywood, movies, Entertainment

On the occasion of Shruti Haasan’s 35th birthday, Hombale Films revealed that the actor has been roped in for its upcoming film Saalar. “We’re ecstatic to have you onboard for #Salaar. Can’t wait to see you sizzle on the screen (sic),” tweeted Hombale Films tweeted. Prabhas also took to his Facebook page to wish his co-star. “Happiest Birthday Shruti Haasan! Looking forward to working with you on #Salaar,” wrote Prabhas.

సలార్ లో ప్రభాస్ సరసన స్టార్ హీరోయిన్..

Posted: 01/28/2021 08:46 PM IST
Prabhas welcomes star actress in lead role in salaar pens a sweet birthday

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా రానున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. కన్నడ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రుతిహాసన్‌కు అవకాశం దక్కింది. ‘సలార్‌’ టీమ్‌లోకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ చిత్రబృందం తాజాగా ఓ పోస్ట్‌ చేసింది. గురువారం శ్రుతి పుట్టినరోజు సందర్భంగా ‘సలార్‌’ టీమ్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. ‘ఎంతో అందమైన శ్రుతిహాసన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘సలార్‌’ చిత్రంలో మీరు కూడా భాగమైనందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.

ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ జనవరి 29 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే గోదావరిఖనిలో భారీసెట్‌ వేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  prabhas  salaar  salaar movie  Shruti Haasan birthday  Prashanth Neel  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh