Venkatesh-Varun Tej's 'F3': Release date announced ఎఫ్-3 తో నాగ పంచమికి తోడలుళ్ల సందడి..

F3 confirms its release date venkatesh and tamannaah starrer sets to arrive

Venkatesh, Varun Tej, Tamannaah, Sunil, pushpa, Mehreen Pirzada, F3 release date, f3, Anil Ravipudi, Tollywood, movies, Entertainment

The makers of Venkatesh and Varun Tej’s ‘F3’ took to social media and announced that the hilarious multistarrer will hit the worldwide theaters on August 27th, 2021. The shooting of the much-anticipated project is currently underway in Hyderabad and the principal star cast is taking part in the proceedings.

ఎఫ్-3 తో నాగ పంచమికి తోడలుళ్ల సందడి..

Posted: 01/28/2021 09:47 PM IST
F3 confirms its release date venkatesh and tamannaah starrer sets to arrive

సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 తెలుగు ప్రేక్షకులను నవ్వుల పువ్వులు పూయించింది. ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఇటు బుల్లితెరపై ప్రసారమైన సందర్భంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది, దిల్ రాజు బ్యానర్ పై యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సీక్వెల్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. చిత్రం పూర్తి నిడివి కామెడీ ఇతివృత్తంగానే రూపోందుతున్న ఎప్ 3 లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఆగస్టు 27న ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపింది. ఎప్ 2 చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి బంపర్ హిట్ కొట్టగా ఎఫ్ 3 చిత్రం సరిగ్గా నాగుల పంచమి రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఎఫ్2 చిత్రానికి పనిచేసిన వారే ఈ సీక్వెల్ కు కూడా పనిచేస్తున్నట్టు తెలిసింది. లాక్ డౌన్ సమయంలో పక్కాగా స్ట్రిప్టు సిద్ధం చేసుకున్న అనిల్ రావిపూడి శరవేగంతో షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్ కూడా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక ఎఫ్2లో కథానాయికలుగా అలరించిన తమన్నా, మెహ్రీన్ లే ఇందులోనూ మురిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : f3  F3 release date  Venkatesh  Varun Tej  Tamannaah  Mehreen Pirzada  Anil Ravipudi  Tollywood  

Other Articles