Keerthy Suresh Waited 7 Years For That Film తండ్రి తెరకెక్కిస్తున్న చిత్రంలో కీర్తి సురేశ్.!

Tovino thomas and keerthy suresh to work together in vaashi

vaashi, keerthy suresh, keerthi suresh, mahesh babu, menaka, revathi, suresh kumar, vishnu raghavan, keerthi suresh movies, keerthi suresh mahanati, keerthi suresh latest movies, keerthi suresh latest news, keerthi suresh latest updates, mollywood, tollywood, movies, Entertainment

Keerthy Suresh is a National star. The success of Mahanati made her a sensational star in the country. She is busy with a couple of interesting films now. Keerthy is coming up with a new film titled Vaashi. Keerthy Suresh’s parents Suresh Kumar and Revathy turn producers for this prestigious film. Tovino Thomas plays the lead role in the movie.

తండ్రి తెరకెక్కిస్తున్న చిత్రంలో కీర్తి సురేశ్.!

Posted: 01/27/2021 07:38 PM IST
Tovino thomas and keerthy suresh to work together in vaashi

తెలుగు మహానటి చిత్రంలో నటించిన సావిత్రి తరువాత అమె పోందిన గౌరవాన్ని పోందిన హీరోయిన్లలో ప్రస్తుతం కీర్తి సురేష్ ఒకరు. హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకులకు చేరువైన ఈమె.. వరుస చిత్రాల ఆఫర్లు వచ్చినా.. ఆచి తూచి మంచి కథాంశం వున్న చిత్రాలనే ఎంచుకుంటూ నటిస్తోంది. తన స్టార్ డమ్ ను ఓ వైపు కాపాడుకుంటూనే తన అభిమానులను కూడా ఖుషీ చేయాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త చిత్రానికి సంతకం చేసింది.

అయితే, ఇలా కొత్త చిత్రం ఒప్పుకోవడంలో విశేషం ఏమీ లేకపోయినప్పటికీ, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది వాళ్ల తండ్రే కావడం ఇక్కడ విశేషం. అందుకే, ఈ చిన్నది ఇప్పుడు తెగ ఆనందపడుతోంది. కీర్తి తాజాగా మలయాళంలో 'వాశి' అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తోవినో థామస్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని కీర్తి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కీర్తి తల్లి, మాజీ నటి మేనక, ఆమె సోదరి రేవతి సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండడం మరో విశేషం.

"తండ్రి నిర్మించే సినిమాలో నటించగలగడం అనేది ఏ అమ్మాయికైనా అదొక కల లాంటిది. అసలు ఇలా తండ్రి బ్యానర్లో నటించడం అన్నది  చాలా ఈజీ అని చాలామంది వాదిస్తారు. కానీ, కచ్చితంగా చెప్పాలంటే, ఏదీ అంత ఈజీగా రాదు. వాశి సినిమా కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది" అంటూ కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె బాల్య స్నేహితుడు విష్ణు రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vaasi  keerthy suresh  keerthi suresh  mahesh babu  menaka  revathi  suresh kumar  mollywood  tollywood  

Other Articles