తెలుగు మహానటి చిత్రంలో నటించిన సావిత్రి తరువాత అమె పోందిన గౌరవాన్ని పోందిన హీరోయిన్లలో ప్రస్తుతం కీర్తి సురేష్ ఒకరు. హోమ్లీ హీరోయిన్ గా ప్రేక్షకులకు చేరువైన ఈమె.. వరుస చిత్రాల ఆఫర్లు వచ్చినా.. ఆచి తూచి మంచి కథాంశం వున్న చిత్రాలనే ఎంచుకుంటూ నటిస్తోంది. తన స్టార్ డమ్ ను ఓ వైపు కాపాడుకుంటూనే తన అభిమానులను కూడా ఖుషీ చేయాలని నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ తాజాగా మరో కొత్త చిత్రానికి సంతకం చేసింది.
అయితే, ఇలా కొత్త చిత్రం ఒప్పుకోవడంలో విశేషం ఏమీ లేకపోయినప్పటికీ, ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నది వాళ్ల తండ్రే కావడం ఇక్కడ విశేషం. అందుకే, ఈ చిన్నది ఇప్పుడు తెగ ఆనందపడుతోంది. కీర్తి తాజాగా మలయాళంలో 'వాశి' అనే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. తోవినో థామస్ హీరోగా నటించే ఈ చిత్రాన్ని కీర్తి తండ్రి, ప్రముఖ నిర్మాత సురేశ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి కీర్తి తల్లి, మాజీ నటి మేనక, ఆమె సోదరి రేవతి సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండడం మరో విశేషం.
"తండ్రి నిర్మించే సినిమాలో నటించగలగడం అనేది ఏ అమ్మాయికైనా అదొక కల లాంటిది. అసలు ఇలా తండ్రి బ్యానర్లో నటించడం అన్నది చాలా ఈజీ అని చాలామంది వాదిస్తారు. కానీ, కచ్చితంగా చెప్పాలంటే, ఏదీ అంత ఈజీగా రాదు. వాశి సినిమా కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది" అంటూ కీర్తి సురేశ్ ట్వీట్ చేసింది. మరో విశేషం ఏమిటంటే, ఆమె బాల్య స్నేహితుడు విష్ణు రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more