Ide maa katha teaser launched ఆకట్టుకుంటున్న 'ఇదే మా కథ' టీజర్‌ ...

Ide maa katha teaser launched by producer dil raju

Idhe Maa Katha, Teaser, Sumanth Ashwin, Srikanth, Bhumika chawla, Tanya Hope, G Mahesh, Guru Pawan, Sunil Kashyup, Tollywood, movies, Entertainment

Manly star Srikanth, Young Hero Sumanth Ashwin, Actress Tanya Hope, Senior Actress Bhumika Chawla all together acted in a movie Ide Maa Katha, the story of the movie goes in bike racing concept, The film Unit has released a teaser today.

ఆకట్టుకుంటున్న 'ఇదే మా కథ' టీజర్‌

Posted: 01/25/2021 10:02 PM IST
Ide maa katha teaser launched by producer dil raju

మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గురు పవన్ దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత మహేష్ గొల్ల ‘ఇదే మాకథ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. బైక్ రేసింగ్ నేపథ్యంలో జరిగిన రైడర్స్ జీవితాలు అనుకోని పరిస్థితుల్లో ఏవిధంగా చెంజెస్ అయ్యాయి అనేది చిత్ర మెయిన్ కథాంశం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.

కాగా ఈ చిత్రం అఫీషియల్ టీజర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘ప్రతి మనిషి లైఫ్‌లో ఓ మెమరబుల్‌ జర్నీ ఉండాలి.. అలాంటి జర్నీలో మరిచిపోలేని పరిచయాలూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రేమ కూడా ఉండాలి’ ‘బట్‌ థ్రిల్‌ ఛేంజస్‌ లైఫ్‌’ అంటూ సుమంత్, శ్రీకాంత్‌ చెప్పే సంభాషణలతో ప్రారంభమయ్యే టీజర్‌ ఆద్యంతం అలరిస్తుంది. దీని బట్టి చూస్తుంటే నలుగురు వ్యక్తులు తమ రోడ్డు ప్రయాణంలో పరిచయమై ఓ ఓ ఛాలెంజ్ లో పాల్గొంటారనిపిస్తుంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఇదే మాకథ’ టీజర్ చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని.. అవ్వాలని కోరుకుంటున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

సి. రాంప్రసాద్ కెమెరా వర్క్ సినిమాకి వన్ ఆఫ్ ది హైలెట్ కానుంది. అలాగే యువ సంగీత కెరటం సునీల్ కాశ్యప్ అందించిన పాటలకి శ్రోతల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి డివోపి; సి. రాంప్రసాద్, మ్యూజిక్; సునీల్ కాశ్యప్, ఎడిటర్; జునైద్ సిద్ధికీ, ఆర్ట్; జేకే మూర్తి, యాక్షన్; పృద్వి శేఖర్, కాస్ట్యూమ్స్; ఎస్ ఎస్. వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; చిరంజీవి లంకెళ్ల, పీఆర్ఓ; వంశీ-శేఖర్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గురు పవన్, నిర్మాత; మహేష్ గొల్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles