Solo Brathuke So Better movie promo చరిత్రలో సుఖపడని వారెవరో చెప్పిన సాయ్ ధరమ్ తేజ్

Solo brathuke so better movie release on dec 25 featuring sai dharam tej nabha

Sai Dharam Tej SBSB, Sai Dharam Tej Solo Brathuke So Better, Solo Brathuke So Better, Sai Dharam Tej Movies, Solo Brathuke So Better movie, SBSB, Supreme Hero, Sai Dharam Tej, Nabha Natesh, Subbu, S Thaman, Dil Raju, Tollywood, Movies, Entertainment

Sri Venkateswara Cine Chitra released the promo of the romantic comedy film Solo Brathuke So Better on Monday. It is a short glimpse of Sai Dharam Tej, the lead actor in the movie, motivating youngsters not to marry. Nabha Natesh has paired opposite Sai Tej. The film was directed by Subbu and the music scored by S Thaman

చరిత్రలో సుఖపడని వారు ఎవరో వివరంగా చెప్పిన సాయ్ ధరమ్ తేజ్

Posted: 12/14/2020 05:13 PM IST
Solo brathuke so better movie release on dec 25 featuring sai dharam tej nabha

ప్ర‌తిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధ‌ర‌మ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా ధియేటర్లలోకి తన తాజా చిత్రం ‘సోలో బ్ర‌తుకే సో బెట‌ర్’తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి వస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. నభానటేష్‌ కథానాయిక. ‘వినూత్నమైన పాయింట్ కు చక్కటి భావోద్వేగాలు, వినోదాన్ని జోడిస్తూ దర్శకుడు సుబ్బు అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించగా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నెల (డిసెంబ‌ర్) 25న చిత్రాన్ని విడుద‌ల కానుంది

చిత్రానికి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇక మ‌రో వారంలో చిత్రం విడుద‌ల  చేయ‌నుండ‌గా, తాజాగా ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో శ్లోకాలు అంటూ ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చిన మెగా హీరో థియేట‌ర్ లో 108 శ్లోకాల‌తో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహా చిత్రంలో చెప్పిన మాస్ డైలాగ్ ను తిరగేసి తన శ్లోకంగా మార్చేసిన తేజ్.. చరిత్రలో సుఖపడని వారెవరో చాలా వివరాణాత్మకంగా చెప్పాడు. అంతేకాదు పెళ్లి చేసుకున్నవాడు నిత్యం తన భార్య చేతిలో ఫూల్ అవుతూనే వుంటాడని విభిన్నంగా సెలవిచ్చాడు. చాలా గ్యాప్ త‌ర్వాత థియేట‌ర్లో సంద‌డి చేయ‌నున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మరి ఆలస్యం లేకుండా ప్రోమో చూసేద్దామా..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Ide maa katha teaser launched by producer dil raju

    ఆకట్టుకుంటున్న 'ఇదే మా కథ' టీజర్‌

    Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more

  • Republic teaser sai dharam tej s lecture on democracy

    సాయి తేజ్ ‘రిపబ్లిక్’ నుంచి తొలి టీజర్..

    Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more

  • Rrr gets release date jr ntr and ram charan feature in new exciting poster

    ’ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేగ్ కన్ఫామ్.. ముహుర్తం ఫిక్స్ చేసిన జక్కన్న

    Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more

  • Court halted the release of ravi teja and shruti haasan starrer krack

    రవితేజ చిత్ర విడుదలకు ‘క్రాక్’ ఎత్తించిన ఫైనాన్షియర్

    Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more

  • Rana daggubati s first glimpse from viraata parvam

    ‘విరాటపర్వం’ నుంచి రానా ఫ్యాన్స్ కు రవన్న కానుక

    Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more

Today on Telugu Wishesh