యావత్ భారత సినీ పరిశ్రమతో కోవిడ్ కారణంగా లాక్ డౌన్ తో మూతబడటంతో యంగ్ హీరోలు ఇంటివాళ్లు అయ్యారు. వీరే కాదు పలువురు హీరోయిన్లు కూడా ఏడడుగులు వేశారు. ఈ జాబితాలో చేరిపోయి.. తన భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ నుంచి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించి వారిలో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న కాజల్.. ముంబైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తను పరిణయం అడింది. గత అక్టోబర్ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకన్న ఈ బామ భర్తతో కలసి హనీమూన్ కు వెళ్లింది. అంతేకాదు అక్కడి ఫోటోలను నిత్యం అప్ డేట్ చేస్తూ తన అభిమానులకు అప్ డేట్ అందిస్తోంది.
ప్రస్తుతం మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదిస్తున్న ఈ కొత్త జంట.. సముద్రపు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్లుగా కాకుండా తన భర్తతో మరికోన్ని రోజుల పాటు ఏకాంతంగా గడిపేందుకు వీలుగా హనీమూన్ ను మరికొన్ని రోజుల పాటు ఎక్స్ టెండ్ చేసుకున్నారు. కాజల్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో పాటు పారిస్ పారిస్, భారతీయుడు 2, ముంబై సాగా వంటి పలు సినిమాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగులు బంద్ అయిన నేపథ్యంలో ఈ సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తోంది కాజల్. త్వరలోనే ఆమె తిరిగి షూటింగుల్లో పాల్గొననుంది.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more