Kajal Aggarwal confirms marriage with Gautam Kitchlu తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

Kajal Aggarwal, gautam kitchlu, celebrity wedding, Kajal marriage, kajal kitchlu, kajal kitchlu marriage, Covid-19, Coronavirus, movies, entertainment, Tollywood

Actress Kajal Agarwal has officially confirmed the that she is yet to marry a businessman Gautam Kitchlu soon, through her social networking page. Kajal Aggarwal is all set to tie the knot with a Mumbai-based entrepreneur in a close-knit affair by the end of the month on October 30, 2020.

తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

Posted: 10/06/2020 10:47 PM IST
Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా వృధా చేయడం ఇష్టం లేని టాలీవుడ్ యంగ్ హీరోలో వరుసగా కోవిడ్ నిబంధనలను కొనసాగిస్తూనే ఇంటివారయ్యారు. ఇక తాజాగా తాను ఈ జాబితాలో చేరిపోతానని అంటోందని అందాల చందమామ. టాలీవుడ్ నుంచి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించి వారిలో సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న నటి కాజల్ అగర్వాల్. అటు యంగ్ హీరోలతో పాటు ఇటు ఇండస్ట్రీ సినయర్ హీరోలతో కూడా నటించి మెప్పించిన నటి.. ఇక తర్వలో పెళ్లి పీటలు ఎక్కాలని యోచిస్తోంది.

అమె చేసిన ట్వీట్ ఆదారంగా ముంబైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో కాజల్ ప్రేమలో పడిందన్న వార్తలు రావడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయడం ఇష్టం లేని నటి.. తన కాబోయే భర్త గురించే కాదు.. తాను పెళ్లి చేసుకోబోయే తేదీ గురించి కూడా తేటతెల్లంగా చెప్పేసింది. 'నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయిలో జరుపుకోనివ్వకుండా చేసింది' అని ఆమె ట్వీట్ చేసింది.

'అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్‌గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను' అని కాజల్ ట్వీట్ చేసింది. అమె ట్వీట్ కు సంతోషం వ్యక్తం చేసిన మరో నటి సమంత ఇక జీవితాంతం ఈ బంధం పెనవేసుకోవాలని ఆకాంక్షిస్తూ కాజల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh