యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్ఆర్ఆర్ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి తరువాత రూపోందిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఎక్కువగా వున్నాయి. ఇటు తెలుగు ప్రేక్షకులతో పాటు అఖిలభారత ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటగా ఈ ఏడాది జూలైలో విడుదల చేస్తామని చెప్పిన చిత్ర నిర్మాణ సంస్థ.. ఆ తరువాత జక్కన నిర్ణయంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా కరోనా నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ఈ చిత్రం విడుదల ఎప్పుడున్నది వేచి చూడాల్సిందే.,
అయితే అన్ లాక్ 4.0 మార్గదర్శకాల్లో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో తాము కూడా గాడిన పడ్డామని.. షూటింగ్ ను మొదలు పెట్టామని చెప్పిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్.. ఈ నేపథ్యంలో తమ చిత్రంపై అంచనాలను సజీవంగా ఉంచేందుకు త్వరలో కుమరం భీమ్ ట్రైలర్ ను విడుదల చేస్తామని ప్రకటించింది, 'మీరు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలోంచి ఓ విషయంపై అప్డేట్ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రానుంది' అని ఆర్ఆర్ఆర్ బృందం తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ రోజు ఉదయం పేర్కొంది. చెప్పినట్లుగానే ఆప్ డేట్ గురించి వీడియో రూపంలో ప్రకటన చేసింది.
ఈ సినిమాలోని భీమ్ పాత్రను పరిచయం చేస్తూ ఈ నెల 22న జూనియర్ ఎన్టీఆర్ టీజర్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఆయన జన్మదినం రోజున కూడా ఆయనకు సంబంధించిన టీజర్ కోసం ప్రేక్షకులు వేచి చూసినా.. అది సాధ్యం కాకపోవడంతో ఇక తాజాగా ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భారీ బడ్జెట్‌తో రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలోంచి చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more